కుంబ్లేతో 'వివాదం'పై కోహ్లి స్పందన | No Problem With Anil Kumble,viirat Kohli | Sakshi
Sakshi News home page

కుంబ్లేతో 'వివాదం'పై కోహ్లి స్పందన

Published Sat, Jun 3 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

కుంబ్లేతో 'వివాదం'పై కోహ్లి స్పందన

కుంబ్లేతో 'వివాదం'పై కోహ్లి స్పందన

లండన్:భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లేతో  వివాదం అంశానికి సంబంధించి కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా కీలకమైన పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పెదవి విప్పాడు. గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూ  వస్తున్న వార్తలకు తనదైన శైలిలో ఖండించి పారేశాడు కోహ్లి. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ ఒక్క మాటలో తేల్చిపారేశాడు.

అది కేవలం ప్రజలు సృష్టించిన వివాదమే కానీ, తమ మధ్య చోటు చేసుకున్న వివాదం కాదంటూ కోహ్లి స్పష్టం చేశాడు.అసలు తనకు కుంబ్లేతో కలిసి పని చేయడానికి ఇబ్బందేమీ లేదంటూ పేర్కొన్నాడు. ఇప్పుడు వరకూ తమ మధ్య ఏదో జరిగినట్లు వచ్చిన వార్తలన్నీ రూమర్లేనని తెలిపాడు.ప్రస్తుతం భారత జట్టులో చోటు చేసుకున్న పరిణామాల్ని ఏవిధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనే ప్రశ్నకు విరాట్ బదులిచ్చాడు. 'అసలు ఏమీ లేనప్పుడు పరిస్థితుల్ని చక్కపెట్టడం ఏముంటుంది.

నేను ఏదో జరిగిందనే విషయం గురించి ఆలోచించనే లేదు. కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టిన మాట వాస్తవం.. కానీ ఏమీ లేదు. ప్రధానంగా భారత క్రికెట్ అభిమానులు కొన్ని రూమర్లు విషయంలో ఓపిగ్గా ఉంటే మంచిది.కుంబ్లేతో వివాదం అనేది కేవలం రూమర్ మాత్రమే. అది కేవలం ప్రజల సృష్టి. ప్రస్తుతం మా దృష్టంతా చాంపియన్స్ ట్రోఫీపైనే' అని కోహ్లి పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement