రెండో రౌండ్కు జొకోవిచ్ | Novak Djokovic survives James Ward scare to ease into second round of Wimbledon | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్కు జొకోవిచ్

Published Mon, Jun 27 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

రెండో రౌండ్కు జొకోవిచ్

రెండో రౌండ్కు జొకోవిచ్

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.

లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 6-0, 7-6(7/3), 6-4 తేడాతో జేమ్స్ వార్డ్(బ్రిటన్)పై విజయం సాధించి శుభారంభం చేశాడు. రెండు గంటల మూడు నిమిషాల పాటు జరిగిన పోరులో జొకోవిచ్ వరుస సెట్లు గెలిచి తొలి రౌండ్ను దిగ్విజయంగా అధిగమించాడు.

తొలి సెట్ను అవలీలగా గెలిచిన జొకోవిచ్కు, రెండో సెట్లో మాత్రం వార్డ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. టై బ్రేక్కు దారి తీసిన ఆ సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుచుకున్నాడు. అనంతరం మూడో సెట్లో  ఆది నుంచి జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచాడు. ప్రత్యేకంగా జేమ్స్ వార్డ్ సర్వీసులకు అడ్డుగోడల నిలబడిన జొకోవిచ్.. ఆ సెట్ను కైవసం చేసుకుని తదుపరి రౌండ్ కు అర్హత సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement