ఆదుకున్న డికాక్, బవుమా
దక్షిణాఫ్రికా 349/9 ∙ కివీస్‌తో రెండో టెస్టు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తడబడిన దక్షిణాఫ్రికాను క్వింటన్ డికాక్ (118 బంతుల్లో 91; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), బవుమా (160 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం 24/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట నిలిచే సమయానికి 9 వికెట్లకు 349 పరుగులు చేసింది.
గ్రాండ్‌హోమ్ (3/52), వాగ్నర్ (3/96)లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒక దశలో 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడ (9), ఆమ్లా (21), డుమినీ (16), డుప్లెసిస్ (22) విఫలమయ్యారు. ఈ దశలో డికాక్, బవుమా ఏడో వికెట్‌కు 160 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం ఫిలాండర్ (36 బ్యాటింగ్), మోర్కెల్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.