
బెంగళూరు టార్గెట్ 188
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, శ్రేయాస్ అయ్యర్ దాటిగా ఆడటంతో ఆరు ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 55 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (20) ఔటయ్యాడు. డికాక్ కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్ధ శతకం సాధించాడు. జట్టు స్కోరు పెంచే క్రమంలో క్వింటన్ డికాక్(39 బంతుల్లో 69: 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. జేపీ డుమిని (47 బంతుల్లో 67: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ 187 పరుగులు చేయగలిగింది.
పది ఓవర్లలో 91/1 తో పటిష్ట స్థితిలో కనిపించిన ఢిల్లీ 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. యువరాజ్(11), కేదార్ జాద్(0) నిరాశ పరిచారు. ఏంజెలో మాథ్యుస్(1) కూడా త్వరగానే రనౌట్ రూపంలో నిష్క్రమించాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.