
ఆఫ్రిదికి సానియా భర్త మద్దతు
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి సీనియ్ బ్యాట్స్మన్, మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ మద్దతు ప్రకటించాడు.
కరాచి: పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి సీనియ్ బ్యాట్స్మన్, మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ మద్దతు ప్రకటించాడు. ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఆఫ్రిదియే సరైనవాడని షోయాబ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కు మిస్బా-వుల్-హక్ స్థానంలో ఆఫ్రిదిని కెప్టెన్ నియమించాలని సూచించారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్బు(పీసీబీ) కెప్టెన్ ను మార్చాలనుకుంటే ఆ పని వెంటనే చేయాలని షోయాబ్ అన్నాడు. ప్రపంచకప్ కు సమయం తక్కువగా ఉందని పేర్కొన్నాడు. 32 ఏళ్ల షోయాబ్ మాలిక్ హైదరాబాద్ అల్లుడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను అతడు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.