
రెండో టెస్టుకు స్టెయిన్ దూరం
బెంగళూరు: టీమిండియాతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శనివారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టుకు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. మొహాలీ టెస్టులో గాయపడిన స్టెయిన్ శుక్రవారం నిర్వహించిన ఫిట్‌నెస్ లో విఫలం చెందడంతో అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ సెలెక్షర్లు ప్రకటించారు.
తొలి టెస్టుకు ముందే మోర్కెల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో పాటు, గురువారం ఫుట్ బాల్ ఆడుతూ వెర్నాన్ ఫిలాండర్ గాయపడటంతో అతను కూడా జట్టుకు దూరమయ్యాడు. దీంతో ముగ్గురు ప్రధాన పేసర్లు లేకుండా దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతుండటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.