
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైఫిల్ సంఘం ఆధ్వర్యంలో గురువారం సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. సంఘీనగర్‌లోని అమన్ సంఘి 300మీ. బిగ్ బోర్ షూటింగ్ రేంజ్ వేదికగా బిగ్ బోర్ షూటింగ్ పోటీలు జరుగుతాయి. ఎల్బీ నగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఐపీఎస్ సున్‌ప్రీత్ సింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు.
మొత్తం 150 మంది షూటర్లు 34 షూటింగ్ ఈవెంట్‌లలో తలపడనున్నారు. సీనియర్, జూనియర్, వెటరన్ పురుషుల మహిళల కేటగిరీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన షూటర్లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షులు అమిత్ సంఘి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment