గాలే: న్యూజిలాండ్‌తో రెండు టెస్టులో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 268 పరుగుల టార్గెట్‌ను లంకేయులు నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే(122; 243 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి రోజు ఆటలో 133/0 ఓవర్ నైట్ స్కోరుతో కరుణరత్నే- తిరిమన్నేలు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు .ఈ జోడి 161 పరుగులు జోడించిన తర్వాత తిరిమన్నే(64) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై 13 పరుగుల వ్యవధిలో కుశాల్ మెండిస్(10) ఔట్ కాగా, కరుణరత్నే మాత్రం సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే మాథ్యూస్‌తో కలిసి 44 పరుగులు జత చేసిన తర్వాత కరుణరత్నే మూడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, జట్టు స్కోరు 250 పరుగుల వద్ద ఉండగా కుశాల్ పెరీరా(23) ఔటయ్యాడు. అయతే మాథ్యూస్(28 నాటౌట్), ధనంజయ డిసిల్వా(14 నాటౌట్)ల మరో వికెట్ పడకుండా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
మూడేళ్లలో మూడుసార్లు శ్రీలంకనే..
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల్ని శ్రీలంక మరోసారి సాధించి అరుదైన ఘనత నమోదు చేసింది. 2016 నుంచి చూస్తే నాల్గో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల్ని ఛేదించిన టాప్-4 జాబితాలో మూడు సార్లు శ్రీలంకనే ఉంది. 2017లో జింబాబ్వేపై 388 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక సాధించగా, అదే ఏడాది ఇంగ్లండ్‌పై 322 పరుగుల టార్గెట్‌ను విండీస్ ఛేదించింది. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో 304 పరుగుల టార్గెట్‌ను లంకేయులు ఛేదించారు. ఇప్పుడు కివీస్‌పై 268 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక ఛేదించింది.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 249 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 285 ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 267 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 268/4
Comments
Please login to add a commentAdd a comment