సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో యూనిక్ అకాడమీ సత్తా చాటింది. అత్యధిక పతకాలు సాధించి ‘గ్రాండ్ చాంపియన్‌షిప్’ను సొంతం చేసుకుంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్ పురుషుల విభాగంలో సాయి బ్రహ్మ (బాంటమ్ వెయిట్), గౌతమ్ (ఫెదర్ వెయిట్), విక్రమాదిత్య (లైట్ వెయిట్), ప్రశాంత్ కుమార్ (వెల్టర్ వెయిట్), భరత్ (మిడిల్ వెయిట్)లు వివిధ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. మహిళల విభాగంలో సుభాషిణి (ఫెదర్ వెయిట్)కి పసిడి పతకం లభించగా... సంగీత మౌర్య (ఫెదర్ వెయిట్)కు రజతం దక్కింది. జూనియర్ బాలికల హెవీ వెయిట్‌లో శ్రీలేఖ స్వర్ణం సాధించింది.
ఇతర విభాగాల ఫలితాలు
సబ్ జూనియర్ బాలురు: హర్ష (స్వర్ణం), ఫాల్గుణ రెడ్డి (స్వర్ణం), అరవింద్ (స్వర్ణం), అజయ్ కుమార్ (స్వర్ణం), సాయి వరుణ్ (స్వర్ణం), విమల్ (రజతం), ఆశ్రయ్ రెడ్డి (కాంస్యం), ఉదయ్ (కాంస్యం).
బాలికలు: సంప్రీతి (స్వర్ణం), తేజస్విని (స్వర్ణం), అశితా చౌదరి (కాంస్యం), మీరా (కాంస్యం).
తైక్వాండో ‘గ్రాండ్ చాంప్’ యూనిక్ అకాడమీ
Published Wed, Aug 7 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement