హరారే: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌కు తమ జట్టు అర్హత సాధించడంపై అఫ్గానిస్తాన్ ఆటగాడు మహ్మద్ షెహ్‌జాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అసలు తమ జట్టుకు దాదాపు అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో క్వాలిఫై కావడం నిజంగా అద్భుతమేనన‍్నాడు. తమకున్న ఒక్క శాతం చాన్స్‌తోనే వరల్డ్ కప్‌కు అర్హత సాధించామని షెహజాద్ స్సష్టం చేశాడు. క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నాడు.
'ఒక్కశాతం చాన్స్‌తోనే వరల్డ్ కప్‌కు అర్హత సాధించామనేది కాదనలేని వాస్తవం. ఇప్పటికీ మా జట్టు క్వాలిఫై అయ్యిందంటే నమ్మలేకుండా ఉన్నాం. క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక ఉదాహరణ. లీగ్‌లో నేపాల్‌పై ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం, ఆపై హాంకాంగ్‌ను నేపాల్ ఓడించడం మాకు సూపర్ సిక్స్ అర్హత లభించింది. ఇక జింబాబ్వేను యూఏఈ ఓడించడంతో ఐర్లాండ్‌తో తమ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి వరల్డ్ కప్‌కు అర్హత సాధించాం. పది జట్లు తలపడిన క్వాలిఫయింగ్ టోర్నీలో రెండు జట్లకు మాత్రమే అవకాశం ఉండగా, అందులో మా జట్టు ఉండటం చాలా ఆనందంగా ఉంది' అని షెహజాద్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment