రోహిత్‌ శర్మే ఎందుకు స్పెషల్‌? | Why Rohit Sharma Special for Yo Yo Test? | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మే ఎందుకు స్పెషల్‌?

Published Sun, Jun 24 2018 11:08 AM | Last Updated on Sun, Jun 24 2018 11:08 AM

Why Rohit Sharma Special for Yo Yo Test? - Sakshi

బెంగళూరు: భారత క్రికెటర్లు యో-యో ఫిట్‌నెస్ టెస్టులో పాసవ్వాలంటే వారి కనీస అర్హత ప్రమాణం 16.1 మార్కులు. గత ఏడాది నుంచి ఈ నిబంధన విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే యో-యో విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐ ఒక్కో ఆటగాడి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు నిబంధనలు సడలించినట్టు సమాచారం.

ఐపీఎల్‌లో ఏ మాత్రం రాణించకున్నా రోహిత్‌ను ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.  అయితే ఆ తర్వాత అతనికి యో-యో టెస్టు నిర్వహించే క్రమంలో కూడా సడలింపు ఇచ్చారు. ఈ నెల 15న రోహిత్‌ యో-యో టెస్టుకు హాజరుకావాల్సి ఉన్నా వ్యక్తిగత పనుల కారణంగా రెండు రోజులు ఆలస్యంగా అతను 17న పరీక్షలో పాల్గొన్నాడు. అయితే, ఈ టెస్టులో అతను విఫలమమైనట్టు వార్తలు వచ్చాయి.  కానీ, అతను ఫెయిలైన విషయాన్ని బోర్డు రహస్యంగా ఉంచిందట. అదే సమయంలో అజింక్యా రహానేను స్టాండ్‌బైగా ఉంచడం కూడా రోహిత్‌ యో-యోలో ఫెయిల్‌ అయ్యాడు అనే దానికి బలాన్ని చేకూర్చింది. కాగా, రోహిత్‌ విజ్ఞప్తి మేరకు బోర్డు 19వ తేదీన  మళ్లీ పరీక్షలో పాల్గొనేందుకు అనుమతించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ రోజు కాకుండా మరుసటి రోజున అతను యో-యో టెస్టులో పాల్గొని నెగ్గడం జరిగింది. మరి.. ఈ ముంబై ఆటగాడికి ఇచ్చినట్టుగా సంజూ శాంసన్‌, మహ్మద్‌ షమి, అంబటి రాయుడులకు వెంటనే మరో చాన్స్‌ ఎందుకు ఇవ్వలేదో తెలియడం లేదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement