యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు.. | A young girl was stabbed with a screwdriver | Sakshi
Sakshi News home page

యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు..

Published Wed, Jul 20 2016 8:39 PM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM

యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు.. - Sakshi

యువతిని స్క్రూడ్రైవర్లతో పొడిచి చంపారు..

గుర్తుతెలియని యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బెంగుళూరు నగరంలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. తుమకూరు- బెంగళూరు నాలుగో నంబర్ జాతీయ ర హదారిలోని హనుమంతపుర గేట్ వద్ద యువతి మృతదేహం కన్పించడంతో ఓ వ్యక్తి డాబస్‌పేటే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డీవైఎస్పీ రాజేంద్రకుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.

యువతి టీషర్ట్, ఫ్యాంటు ధరించి ఉందని, వయసు 20-22 ఏళ్లు ఉంటుందని, మృతదేహం రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తెల్లవారుజామున జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. స్క్రూ డ్రైవర్లతో పొడిచి, రాడ్లతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. యువతి అత్యాచారానికి గురైనట్లు ప్రాథమికంగా తేలిందని వైద్యులు తెలిపారు. పరిచయస్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక కిడ్నాప్ చేసి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement