సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాణిజ్యవేత్త అనిల్ అంబానీ...లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను బుధవారం రాజ్‌నివాస్‌లో కలిశారు. కేజ్రీవాల్ సర్కారు అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన డిస్కంల ఖాతాలను ఆడిట్‌కు ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన బీఏసీఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ కంపెనీలు విద్యుత్ సరఫరాలో కోత విధించినట్లయితే వాటి లెసైన్సులను రద్దు చేయాలని కూడా కేజ్రీవాల్ సర్కారు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్‌సీ)ను ఆదే శించింది. ఈ రెండు కంపెనీలు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ నేషనల్ థర్మల్ పవర్ కంపెనీ (ఎన్ టీపీసీ) డిస్కంలను హెచ్చరించింది.
అనిల్ అంబానీ, నజీబ్ జంగ్‌ల మధ్య గంట సేపు జరిగిన సమావేశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాల యం మర్యాదపూర్వకమేనని పేర్కొంది. అయి తే డిస్కంల ఖాతాలపై కాగ్ ఆడిట్, కోత విధిస్తే లెసై న్సు రద్దు హెచ్చరిక, బకాయిల చెల్లింపుకోసం ప్రభుత్వ సహాయం, విద్యుత్ చార్జీల పెంపు తది తర విషయాలు చర్చకు వచ్చిఉంటాయని భావి స్తున్నారు. అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రెండు డిస్కంలు నగరంలోని 70 శాతం ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు విద్యుదుత్పత్తి కంపెనీలకు రూ. 4,000 వేల కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉంది.
లెఫ్టినెంట్ గవర్నర్‌తో అనిల్ అంబానీ భేటీ
Published Thu, Feb 20 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement