
బాబు భద్రతకు కొత్తగా 290 పోస్టులు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ భారీగా పెంచుతూ హోం శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందుకోసం కొత్తగా 290 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు ఎస్పీలు, ఏడుగురు డీఎస్సీలు, 23 మంది ఇన్ స్పెక్టర్లు, 51 మంది ఆర్ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. మిగిలిన పోస్టుల కింద కానిస్టేబుల్స్ ను భర్తీ చేస్తారు.