భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమిలో లుకలుకలు మొదలయ్యూయి. కూటమి నుంచి ఎండీఎంకే వైదొలగడం దాదాపు ఖరారు కాగా,
చెన్నై, సాక్షి ప్రతినిధి:భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమిలో లుకలుకలు మొదలయ్యూయి. కూటమి నుంచి ఎండీఎంకే వైదొలగడం దాదాపు ఖరారు కాగా, మరో రెండు పార్టీలు కూటమితో కటీఫ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పార్లమెంటు ఎన్నికల సమయంలో మోడీ ప్రభావంతో రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీలంటే పడని ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్‌డీఏ(బీజేపీ) కూట మిలో చేరిపోయాయి. పొత్తు పార్టీల వల్ల పార్లమెంటు సీట్లు గెలవకు న్నా, గణనీయమైన ఓట్లు లభిం చాయి. కూటమిలోని పీఎంకే మాత్రం ఒక్క సీటు దక్కించుకుంది. 2016లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే కూటమి కొనసాగుతుందని అందరూ ఆశించారు. రాజపక్సేతో రగడ: శ్రీలంక అన్నా, ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే పేరు చెప్పినా తమిళులు, తమిళ పార్టీల వారు మండిపడతారు.