డెంగీపై ‘సాక్షి’ కథనంతో పీహెచ్‌సీ అధికారులు స్పందించారు.
గోపాలపురంలో డెంగీ కలకలం అన్న శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో వెలువడిన కథనంతో బందలుప్పి పీహెచ్‌సీ అధికారులు, ఈఓపీఆర్‌డీ కూర్మనాథ్ పట్నాయక్ అప్రమత్తమై గ్రామంలో హుటాహుటిన వైద్యశిబిరం ఏర్పాటు చే శారు. గ్రామంలో కాలువలు, రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య పనులను చేపట్టారు. లోకేష్ మరణ వార్తతో గ్రామస్తుల్లో భయం పుట్టి ప్రతి ఒక్కరూ వైద్యశిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్‌డీ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆరుబయట మల విసర్జనను మాని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.