సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్థానిక చౌరస్తాలో గురువారం సాయంత్రం లారీ బీభత్సం సృష్టించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కదిర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కదిర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.