న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌కు నాలుగు అంకెల నంబర్‌ను శుక్రవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దీంతోపాటు పాత నంబర్‌ను కూడా కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘గత 36 గంటల్లో హెల్ప్‌లైన్‌కు సుమారు 23,000 కాల్స్ వచ్చాయి. ఒక వ్యక్తిని పట్టుకున్నాం కూడా. మరోవ్యక్తి చివరి నిమిషంలో లంచం తీసుకోవడానికి నిరాకరించి తప్పించుకున్నాడు..’ అని వివరించారు.
కరెంట్ కోతలపై ఎస్‌ఎంఎస్ చేస్తే చాలు..
ఏ డిస్కమ్ అయినా అప్రకటిత కరెంటు కోతలకు పాల్పడితే వినియోగదారులు ఒక ఎస్‌ఎంఎస్ చేస్తే చాలు.. తమ సర్కారు సత్వర చర్యలు తీసుకుం టుందని సీఎం పేర్కొన్నారు. ‘మీ ప్రాంతంలో అప్రకటిత కరెంటు కోత ఉంటే మీరు వెంటనే సెల్ నం బర్- 9223166166కు ఎస్‌ఎంఎస్ చేయండి.. చాలు..’ అని సీఎం చెప్పారు. ‘డిస్కంల నుంచి కరెంటు కోతల వివరాలను తీసుకుంటాం. నిరాధారమైన అప్రకటిత కోతలుంటే సదరు కంపెనీ నుంచి జరిమానా వసూలుచేస్తామ’న్నారు.
అవినీతిపై కొత్త హెల్ప్‌లైన్- 1031
Published Fri, Jan 10 2014 11:28 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
Advertisement