చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడమా: బృందాకరత్ | how can capitalist chandra babu write letter to narendra modi, asks brinda karat | Sakshi

చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడమా: బృందాకరత్

Oct 14 2016 2:30 PM | Updated on Apr 3 2019 5:16 PM

చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడమా: బృందాకరత్ - Sakshi

చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడమా: బృందాకరత్

ఎప్పుడూ పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలికే చంద్రబాబు.. నల్లధనం అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం విడ్డూరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మండిపడ్డారు.

ఎప్పుడూ పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలికే చంద్రబాబు.. నల్లధనం అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం విడ్డూరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మండిపడ్డారు. ఆక్వా ఫుడ్ పార్కు పేరుతో పేదల పొట్టగొట్టే చంద్రబాబు.. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ఆమె విమర్శించారు.

కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్-2016 పథకంలో మొత్తం రూ. 65వేల కోట్ల మేర నల్లధనాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించగా, అందులో రూ. 13 వేల కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. అందులోనూ రూ. 10వేల కోట్లను ఒకే వ్యక్తి వెల్లడించారంటూ ఆయన తెలిపారు. ఈ అంశంపైనే బృందకరత్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement