నిరసన వినూత్నం | Innovative protest | Sakshi
Sakshi News home page

నిరసన వినూత్నం

Published Tue, Oct 13 2015 2:09 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

నిరసన వినూత్నం - Sakshi

నిరసన వినూత్నం

రహదారుల దుస్థితిని పట్టించుకోని పాలకులు వైఖరిని మైసూరు వాసులు వినూత్నంగా ఎండగట్టారు. మైసూరు దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు రాచనగరికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మైసూరులోని రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.

ఈ విషయంపై మైసూరులోని సుబ్బరాయనకెరె వాసులు అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ఉన్న గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో పిండ ప్రదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకుల్లో మార్పు వస్తుందో.. లేదో వేచి చూడాలి.       - బెంగళూరు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement