రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి
ఆదిలాబాద్ : రివాల్వర్ మిస్ ఫైర్ అయి ఎస్ఐ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కెరమెరి పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ మంగళవారం ఉదయం రివాల్వర్ మిస్ ఫైర్ అయింది.
పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఆయన తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ రెండు బుల్లెట్లు తలలో దూసుకెళ్లాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం అవునూరు గ్రామానికి చెందిన శ్రీధర్ శిక్షణ పూర్తి చేసుకుని రెండు రోజుల కిందటే సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా కెరమెరిలో పోస్టింగ్ పొందారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.