న్యూఢిల్లీ: రాంలీలా మైదానంలో పది ద్రోణ్ కెమెరాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆచరణకు నోచుకునేవిధంగా కనిపించడంలేదు. ఇందుకు కార ణం పోలీసు శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడమే. పోలీసు శాఖ అధికారులందించిన సమాచారం ప్రకారం నగర పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా మనుషులతో పనిలేకుండా మానవ రహిత వాహనాలకు (యూఏవీ) అనుమతి లేదు. సాధారణంగా పౌరులు ఉపయోగించే ద్రోణ్‌లు అత్యంత చిన్నగా ఉంటాయి. వీటికి కెమెరాలను అమరుస్తారు. ఆ తర్వాత నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, సినిమా షూటింగ్ తదితర అవసరాలకు వినియోగిస్తుంటారు. వీటి పొడవు రెండు మీటర్లకు మించదు. బరువు కూడా రెండు కిలోల కంటే తక్కువగా ఉంటుంది. రిమోట్ ఆధారంగా పనిచేసే ఈ ద్రోణ్‌ల వేగం గంటకు 40 కిలోమీటర్లు.
అనుమతి పొందలేదు: రాంలీలా కమిటీ
ఈ విషయమై రాంలీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతానికి తాము పోలీసు శాఖ అనుమతి పొందలేదన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి మాత్రం తీసుకెళ్లా మన్నారు. దీంతోపాటు కేంద్ర హోం శాఖ మం త్రితో కూడా మాట్లాడామన్నారు. వీటి విషయంలో పోలీసులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చన్నారు. కాగా ద్రోణ్ కెమెరాలకు సంబంధించి రాంలీలా కమిటీనుంచి తమకు ఎటువంటి దరఖాస్తు అందలేదని ఉత్తర జిల్లా డీ సీపీ మధుర్ వర్మ చెప్పారు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. భద్రతాపరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ఎర్రకోట వద్ద వీటిని వినియోగించేందుకు అనుమతి లేదన్నారు.
రాంలీలా మైదానంలో ద్రోణ్ కెమెరాలపై పోలీసు శాఖ అభ్యంతరం
Published Sat, Sep 20 2014 10:57 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement