న్యూఢిల్లీ: త్రిలోక్‌పురి ఘర్షణలు ఢిల్లీ పోలీసులకు సరికొత్త గుణపాఠాలను నేర్పాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసు బలగాలను బలోపేతం చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తూ ఘర్షణలను తగ్గించడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.‘త్రిలోక్‌పురిలో ఘర్షణలు నివారించడానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అది కూడా దీర్ఘకాలం కొనసాగించాల్సి వచ్చింది. దీన్ని అధిగమించడానికి నూతన నిబంధనలు రూపొందించామని’ నగర్ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. దీని ప్రకారం ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు పోలీసు సిబ్బంది ఏ యూనిట్‌లో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్పప్పటికీ ఆయా సంఘటన స్థలానికి తక్షణమే తరలి వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో సిబ్బంది ఈ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
వివిధ కేటగిరీలుగా వర్గీకరణ
ఈ సిబ్బందిని వివిధ కేటగిరిలుగా వర్గీకరించారు. ఆకస్మిక డ్రిల్-(సీడీ) ఇందులో యూనిట్‌లో 20 శాతం బలగాలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్తాయి. సీడీ-1- సీడీ-9 గా వ్యవహరిస్తారు. సీడీ-2లో 20 శాతం సిబ్బంది ఉంటారని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా సిబ్బందిని ప్రత్యేక యూనిట్స్‌గా విస్తరించడానికి అవకాశం ఉంది. స్పెషల్ సెల్, క్రైమ్‌బ్రాంచ్ విభాగాలకు సహాయంగా ట్రాఫిక్, మహిళా స్పెషల్ పోలీస్ యూనిట్లు పనిచేస్తాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో రంగంలోకి దిగి స్థానిక పోలీసులతో కలిసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాయి.
ఇదే విధానాన్ని 11 జిల్లాలోనూ అమలు చేస్తారు. ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యవసరం అయినప్పుడు సీడీ-3 రంగంలోకి దిగుతుంది. ఇందులో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన 30 శాతం పోలీసు సిబ్బంది ఉంటారు. సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్‌లో 15 నుంచి 200 మంది సిబ్బంది పెట్రోలింగ్, వివిధ రకాల విధుల్లో ఉంటారు. ఒక నోటీస్ జారీ చేస్తే వీరంతా అత్యవరస విధుల్లో చేరాల్సి ఉంటుంది. సెలవులో ఉన్నప్పటి కీ విధులకు హాజర వుతారు. త్రిలోక్‌పురిలో ఇరువర్గాల మధ్య చిన్న ఘర్షణ కారణంగా మొదలైన అల్లర్లలో 19 మంది ప్రజలు 13 మంది పోలీసులు గాయపడ్డారు. నూతన పద్ధతి ప్రకారం అధిక సంఖ్యలో పోలీసులు బలగాలు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని ఎదుర్కొని, అదుపు చేసే అవకాశం ఉంటుందని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
త్రిలోక్‌పురి ఘటనతో ‘పోలీస్’ అప్రమత్తం
Published Sun, Nov 9 2014 10:04 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement