ముఖ్యమంత్రి జయలలితకు వేల కోట్లు ఎలా వచ్చాయి? | LS polls: Kanimozhi attacks Jayalalithaa | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి జయలలితకు వేల కోట్లు ఎలా వచ్చాయి?

Published Sat, Apr 12 2014 11:58 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

LS polls: Kanimozhi attacks Jayalalithaa

గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: గతంలో నెలకు రూపాయి మా త్రమే జీతం తీసుకున్న జయలలితకు వేల కోట్లు ఎలా వచ్చాయని డీఎంకే నాయకురాలు కనిమొళి అన్నారు. తిరువళ్లూరు పార్లమెంట్ నియోజకవర్గ డీఎంకే కూటమి అభ్యర్థి రవికుమార్‌కు మద్దతుగా పెరియపాలెంలో ఎన్నికల ప్రచారం శుక్రవారం రాత్రి నిర్వహించారు. కనిమొళి మాట్లాడు తూ ఆదాయానికి మించి ఆస్తుల కేసు లో బెంగళూరు కోర్టుకు వెళ్లడానికే జయకు సమయం లేదని, మరి ఢిల్లీకి ఎలా వెళ్లగలరని, రాజ్యాంగం, చట్టం పై ఆమెకు గౌరవం లేదన్నారు. హెలి కాప్టర్‌లో ప్రచారం చేసే ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు దేశ భవి ష్యత్‌ను మార్చేవి కనుక ప్రజా సంక్షేమం పట్టని వారికి బుద్ధి చెప్పాల ని ఓటర్లు కోరారు. ప్రచారంలో జిల్లా డీఎంకే కార్యదర్శి సుదర్శనం, యూ నియన్ కార్యదర్శి జే మూర్తి, యువజన కార్యదర్శి జే మూర్తి, యువజన కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement