
మాతృభాష తమిళమే
తల్లిదండ్రులు వేర్వేరు భాషలకు చెందిన వారైతే ఆ రెండు భాషల్ని వారి సంతానం అవసరార్థం వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు వేర్వేరు భాషలకు చెందిన వారైతే ఆ రెండు భాషల్ని వారి సంతానం అవసరార్థం వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. వర్ధమాన నటి కీర్తి సురేష్ ఈ టెక్నిక్‌నే వాడుకుంటోంది. ఈ మలయాళీ బ్యూటీ కోలీవుడ్ అరంగేట్రం ఇప్పటికే జరిగిపోయింది. ఒకేసారి ఏకంగా రెండు చిత్రాల్లో నటించేస్తోంది. ఒకటి విక్రమ్‌తోను మరొకటి శివకార్తికేయన్‌తోను చేస్తోంది.
విక్రమ్ ప్రభుకు జంటగా విజయ్ దర్శకత్వంలో నటిస్తున్న ఇదు ఎన్న మాయం చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శివకార్తికేయన్‌తో జోడి కడుతున్న రజనీ మురుగన్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్న అనుభవాన్ని కీర్తి చెబుతూ రజనీ మురుగన్ చిత్ర షూటింగ్ కారైకుడిలో జరుగుతోందని చెప్పింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్, సూరిల కాంబినేషన్‌లో నటించడం చాలా జోవియల్‌గా ఉందని పేర్కొంది. మదురై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తాను గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది.
రొమాంటిక్, కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు వివరించింది. ఇక ఇదు ఎన్న మాయం చిత్రంలో పూర్తిగా మోడ్రన్ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది. తమిళభాష కష్టమనిపిం చడం లేదా? అన్న ప్రశ్నకు ఎలాంటి కష్టం లేదని అంది. ఎందుకంటే తన తల్లి తమిళనాడుకు చెందిన వారే. ఇంట్లో తమిళంలో కూడా మాట్లాడుకుంటాం. ఆ విధంగా తమిళం తన మాతృభాష అవుతుంది అని కీర్తి సురేష్ పేర్కొంది.