ప్రధాని నిర్ణయమేమిటో?
Published Sun, Nov 10 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
సాక్షి, చెన్నై:శ్రీలంక వేదికగా ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు కామన్వెల్త్ దేశాల సమావేశాలు జరగనున్నారుు. ఈ సమావేశాల్లో భారత్ పాల్గొనరాదంటూ తమిళనాట ఆందోళనలు మొదలయ్యూ యి. ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక వెళ్లనున్నారన్న సమాచారంతో ఇటీవల ఆందోళనలు ఉద్ధృతమయ్యూయి. తమిళుల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే వాణి వినిపిస్తున్నారు.
నోరు విప్పని ప్రధాని
కామన్వెల్త్ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పడం లేదు. తమిళుల మనోభావాలకు అనుగుణంగా ప్రధాని నిర్ణయం తీసుకుంటారంటూ కొందరు, తమిళవాణిని శ్రీలంక వేదికగా గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారని మరికొందరు ఢిల్లీ నేతలు చెబుతున్నారు. శ్రీలంకతో సత్సంబంధాలు ముఖ్యమని కాంగ్రెస్ ఉన్నతస్థాయి, మంత్రివర్గ సమావేశాల్లో మన్మోహన్ పేర్కొన్నారు. అయితే స్వయంగా తాను హాజరయ్యే విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. సమావేశాల్లో పాల్గొనే విషయమై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ ఉన్నతస్థాయి, మంత్రివర్గ సమావేశాల్లో మన్మోహన్ భుజానే వేశారు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఒత్తిడి పెంచిన మంత్రులు
కామన్వెల్త్‌కు వ్యతిరేకంగా తమిళనాట సాగుతున్న ఆందోళనల తీవ్రతను కేంద్ర మంత్రులు గుర్తించా రు. తమిళుల మనోభావాలకు అనుగుణంగానే మన్మోహన్ నడుచుకుంటారని కేంద్ర మంత్రులు ఆంటోని, చిదంబరం, జీకే వాసన్, జయంతి న టరాజన్, నారాయణస్వామి, సుదర్శన నాచ్చియప్పన్ పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే విషయమై ప్రధానిపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు.
లంకకు సల్మాన్ బృందం
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని అధికారుల బృందం శ్రీలంకకు పయనమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వ్యవహారాల మేరకు ఆ శాఖ వర్గాలు తప్పనిసరిగా సమావేశాలకు వెళ్లాల్సి ఉన్నందునే మంత్రి నేతృత్వంలో బృందం సిద్ధమవుతోందని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. అరుుతే మన్మోహన్ దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగినా జరగొచ్చంటూ మెలిక పెట్టారు.
చల్లారని ఆగ్రహం
రాష్ట్రంలో నిరసన జ్వాలలు చల్లారడం లేదు. పలుచోట్ల శనివారం నిరసన తెలిపారు. హిందూ సత్యసేన నేతృత్వంలో బేసిన్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. రైల్‌రోకోకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు, ఈలం తమిళాభిమాన సంఘాల నేతృత్వంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
దీక్ష విరమణ
చెన్నైలో ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎట్టకేలకు శనివారం దిగొచ్చారు. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా ఐదుగురు విద్యార్థులు నుంగబాక్కంలో ఆమరణ దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. శ్రీలంకకు చెందిన తమిళ నేతలు ఆనందీ, శశిధరన్ ఫోన్ ద్వారా వీరిని పరామర్శించారు. దీక్ష విరమించాలని సూచించారు. దీక్ష విరమణకు విద్యార్థులు అంగీకరించారు. వీరికి నటుడు సత్యరాజ్ కొబ్బొరి బొండాలిచ్చి దీక్ష విరమింపజేశారు.
Advertisement
Advertisement