కోతిని మింగిన కొండచిలువ
కోతిని మింగిన కొండచిలువ
Published Mon, Nov 14 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
ఖమ్మం: కొండచిలువకు ఆకలేస్తే వెనుకా ముందు చూడకుండా కనిపించిన వాటినల్లా మింగేస్తుంది. ఆ అలవాటే పాపం ఈ కొండచిలువ ప్రాణాల మీదకు తెచ్చింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దార్పల్లిలో ఓ కొండచిలువ కోతిని చంపి మింగడానికి ప్రయత్నించింది. కానీ కోతిని మింగలేక అవస్థలు పడుతున్న కొండచిలువను స్థానికులు గమనించారు. దీంతో దాన్ని చంపి కోతిని బయటకు తీశారు. ఈ ఘటనలో కొండచిలువ చేతిలో కోతి, స్థానికులతో చేతిలో కొండచిలువ రెండూ చనిపోయాయి. కొండచిలువ సుమారు 8 అడుగుల పొడవు ఉంది. స్తానికులు ఈ దృశ్యాన్ని చూడటానికి ఎగబడ్డారు.
Advertisement
Advertisement