ఘటనా స్థలంలో కొండచిలువ, కోతి
భద్రాచలం , కారేపల్లి: కారేపల్లి సమీపంలోని చీమలపాడు అటవీ ప్రాంతంలో పత్తి చేను వద్ద 10 అడుగుల కొండచిలువ ఓ కోతిని మింగేసింది. సోమవారం ఇక్కడి పరిసరాల్లో కోతుల మంద సంచరిస్తున్న క్రమంలో.. భారీ కొండ చిలువ ఓ కోతిని నోట కరుచుకొని మింగేసే ప్రయత్నం చేస్తుండగా.. మిగతా కోతుల మంద వింత శబ్దాలతో అరుస్తూ, అటూ ఇటూ భయంగా చిందులు వేస్తుండగా సమీపంలోని రైతు పోతురాజు రాంకోటయ్య అక్కడికి చేరుకున్నాడు.
అప్పటికే సగం వరకు కోతిని మింగి.. ఆపసోపాలు పడుతున్న కొండ చిలువను గుర్తించి.. గ్రామస్తులకు ఫోన్‌లో సమాచారం అందించారు. కాసేపట్లోనే కర్రలతో చేరుకున్న స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. దాని నోటి భాగంలో చనిపోయి ఉన్న కోతిని బయటకు తీశారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని.. ఈ వింతను ఆసక్తిగా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment