శివమొగ్గలో అదుపులోకి రాని పరిస్థితి
వైద్యుడిపై కత్తులతో దాడి మరో వ్యక్తి హత్య
చుట్టుముట్టిన పోలీసు బలగాలు
పరిస్థితిని పరిశీలించిన హోం మంత్రి
మత పెద్దలతో చర్చలు జరిపిన కె.జె.జార్జ్
శివమొగ్గలో పరిస్థితి అదుపులోకి రాలేదు. రెండ్రోజుల క్రితం చెలరేగిన ఘర్షణలు మరింత ఉద్రిక్తతను నెలకొల్పాయి. నగరం మొత్తం పోలీసుల ఆధీనంలో ఉన్నా... మరో యువకుడి హత్య చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఎక్కడ చూసినా తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాలు, పండ్ల వ్యాపారుల పాకలు కాలుతునృ్న దశ్యాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొత్తం కంటి మీద కునుకు లేకుండా పోలీసులు పహారా కాసినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసుల ఎత్తుగడులను అసాంఘిక శక్తులు చిత్తు చేస్త్తూ విజృంభిస్తున్నాయి. స్థానికులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. నగరం మొత్తం ఖాకీల మయమై ఉంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని బలగాలను రప్పిస్తున్నారు.
శివమొగ్గ:శివమొగ్గలో ప్రశాంతత దూరమైంది. నగరంలో చెలరేగిన ఘర్షణలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గురువారం చెలరేగిన ఘర్షణల్లో మరణించిన విశ్వనాథ్ అంతిమ యాత్ర శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుండగులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసు లు తమ లాఠీలకు పనిచెప్పారు. నగరంలోని పలు ప్రాం తాల్లో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న తోపుడు బళ్లు, పాకలకు ఆగంతకులు నిప్పు పెట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో శనివారం మంటలు ఎగిసిపడ్డాయి. పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం బంద్‌కు విశ్వహిందూపరిషత్ పిలుపునిచ్చింది. కాగా, శుక్రవారం రాత్రి నగర శివారులోని తెవరచడ్నహళ్లి గ్రామంలో విధులు ముగించుకుని నగరానికి వస్తున్న పశువైద్యాధికారి జయకాంత్‌పై ముగ్గురు దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. వారి బారి నుంచి అతి కష్టంపై వైద్యుడు తప్పించుకుని చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. నగరంలోని టిప్పు నగర్‌లో ఉన్న పద్మా టా కీస్ వెనుక మంజునాథ్(35)ను కొందరు దారుణంగా కొట్టి హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం మృతదేహాన్ని గుర్తించి మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు.
హోం మంత్రి పర్యటన
రెండ్రోజులుగా శివమొగ్గలో చోటు చేసుకుంటున్న అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రత్యేక హెలికాప్టర్‌లో నగరానికి శనివారం చేరుకున్నారు. నేరుగా ఆస్పత్రికి చేరుకుని హత్యకు గురైన మంజునాృ్ మతదేహాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. హోం మంత్రి వచ్చారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి కారును ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు అప్రమత్తమై గుంపును చెదరగొట్టారు. అనంతరం మతపెద్దలతో హోం మంత్రి సమావేశమయ్యారు. ఘర్షణల కారణంగా శివమొగ్గలో చోటు చేసుకున్న ఆస్తి నష్టానికి సంబంధించి రూ.50 లక్షల పరి హారాన్ని అందించనున్నట్లు మంత్రి కె.జె.జార్జ్ ప్రకటించారు.
బీజేపీ ధర్నా
శివమొగ్గలో అల్లర్లను అదుపు చేయడంలో పోలీసు ల వైఫల్యాన్ని నిరసిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డీసీఎం కె.ఎస్. ఈశ్వరప్ప, ఎంపీ అయనూరు మంజునాథ్ పాల్గొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయంటూ ఈ సందర్భంగా ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కారులతో ఏడీజీపీ అమర్‌కుమార్ పాండే చర్చించి ఆందోళనను విరమింపజేశారు. మరో వైపు నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది. పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. నగరం నిర్మానుష్యంగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు వాహనాలు లేక ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఎక్కడ చూసినా పోలీసులు మొహరించారు. నగరంలో ఏడీజీపీ అమర్‌కుమార్‌పాండే, ఐజీపీ నంజుండస్వామి, తుమకూరు ఎస్పీ రమణ్‌గుప్తా, హవేరి జిల్లా ఎస్పీ శశికుమార్, బీదర్ ఎస్పీ కార్తిక్‌రెడ్డి తదితరాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఆరని చిచ్చు
Published Sun, Feb 22 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement