మైసూరు : కావేరి నదీ జలాల పంపకం విషయంలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నూతన సమస్యలు ృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మైసూరులో స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరి నిర్వహణ మండలి ఏర్పాటు చేయబోమని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనతో కూడా చెప్పారని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గత ఏడాది 192 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా అధిక వర్షపాతం వల్ల ఇప్పటికే 260 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అయినా తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసుల పేరుతో సమస్యలు ృష్టిస్తోందన్నారు. ఇప్పటికీ కావేరి టిబ్యునల్‌కు సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ విషయం తేలేవరకూ కావేరి నిర్వహణ బోర్డు ఏర్పాటు కాబోదని సిద్ధరామయ్య వివరించారు.
సీఎన్‌ఆర్ రావు.. అసాధ్యుడు.. : సీఎం
సామాన్యుడిగా ఉంటూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి భారతరత్న సీఎన్‌ఆర్. రావు అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. ఇక్కడి సార్వత్రిక విశ్వ విద్యాలయం, ది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లు సంయుక్తంగా శనివారం సీఎన్‌ఆర్. రావు అభినందన సభను ఏర్పాటు చేశాయి.
ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, సామాన్య కుటుంబంలో పుట్టిన రావు దేశంలోనే కాకుండా విదేశాల్లోని విశ్వ విద్యాలయాల నుంచి కూడా మొత్తం 63 డాక్టరేట్లను పొందారని ప్రశంసించారు. అనేక పరిశోధనల ద్వారా విజ్ఞాన రంగానికి విలువైన కానుకలు అందించారని పేర్కొన్నారు. రావును అభినందించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమని అన్నారు. ఈ నెల 18న బెంగళూరులో కూడా ఆయనను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎన్‌ఆర్. రావు దంపతులను ముఖ్యమంత్రి సన్మానించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యల సృష్టి
Published Sun, Jun 15 2014 3:15 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM
Advertisement