సుప్రీంకోర్టు ఆదేశాల మేరకేనని సీఎం సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. ఏసీబీని ఏర్పాటు చేయడం వెనక లోకాయుక్త సంస్థను నీరుగార్చే ఉద్దేశమేదీ తమ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. లోకాయుక్త సంస్థ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఏసీబీ ఏర్పాటు తర్వాత కూడా లోకాయుక్త ఎప్పటిలాగే తన విధులను నిర్వర్తించనుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకాయుక్త విధులకు అడ్డుతగిలేలా నడుచుకోబోమని తెలిపారు.
అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణల సమయంలో కొన్ని గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటుండడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఏసీబీని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మైసూరులో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త రాజు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారాన్ని అందించనుందని చెప్పారు. మైసూరు శాం తి, సౌభ్రాతృత్వాలకు నిలయమైన నగరమని, అలాంటి చోట ఇ లాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతానికి మైసూరు నగరంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయ న్నారు.
రాష్ర్టంలో ఏసీబీ ఏర్పాటు
Published Wed, Mar 16 2016 1:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement