- మృతుల పేర్లు వెల్లడించిన మావోయిస్టు పార్టీ
- 30 మందిలో 27 పేర్ల వివరాలతో జాబితా
సాక్షి, విశాఖపట్నం: ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. ఆ ఘటనలో 30 మంది మృతి చెందగా వారిలో 27 మంది పేర్లను మావోయిస్టు పార్టీ ఏవోబీ కమిటీ పేరిట ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ జాబితాలో ఆర్కే, గాజర్ల రవి, అరుణ వంటి అగ్రనేతలెవరూ లేరు. వీరెక్కడున్నది పార్టీ ప్రకటించలేదు. మల్కన్‌గిరి అటవీ ప్రాంతం జంత్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 24, 25, 26వ తేదీల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 30 మంది మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో పోలీసులు 18 మందినే గుర్తించారు. కాగా ఆదివారం మావోయిస్టు పార్టీ ప్రకటించిన జాబితాతో కొంతమేర సందిగ్ధత వీడింది. మిగిలిన ముగ్గురు గిరిజనులై ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు
► బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్ (బాకూరు గ్రామం, విశాఖ జిల్లా),
► చామళ్ల కిష్ణయ్య అలియాస్ దయా (శ్రీకాకుళం-కోరాపూట్ డీవీసీఎస్-స్వస్థలం- నల్లగొండ,) డివిజన్ కమిటీ సభ్యుడు
► జలుమూరి శ్రీనుబాబు అలియాస్ రైనో (డీసీఎం, థర్డ్ సీఆర్సీ,)
జిల్లా కమిటీ సభ్యులు
► అక్కిరాజు పృధ్వీ అలియాస్ మున్నా (ఆర్కే కుమారుడు, డీసీఎం, స్వస్థలం ప్రకాశం జిల్లా) ఇనపర్తి దాసు అలియాస్ మధు (డీసీఎం ఏవోబీ టెక్ టీం, స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా)
► బోడు కుందనాలు అలియాస్ మమత (చెల్లూరి నారాయణరావు భార్య, డీసీఎం, స్వస్థలం- శ్రీకాకుళం) లత అలియాస్ పద్మ (దుబాసీ శంకర్ భార్య), డీసీఎం స్వస్థలం హైదరాబాద్
► యామలాపల్లి సింహాచలం అలియాస్ మురళి అలియాస్ హరి (జిల్లా కమిటీ సభ్యుడు, డీసీఎం, విజయనగరం)
► కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రిక్కీ (డీసీఎం, ఆర్టీసీ మాజీ కండక్టర్, స్వస్థలం పశ్చిమగోదావరి)
► రాజేష్ అలియాస్ బిమల్ (డీసీఎం-ఫస్ట్ సీఆర్సీ, స్వస్థలం ఛత్తీస్‌గఢ్)
► గెమ్మిలి కేశవరావు అలియాస్ బిరుసు (డీసీఎం, స్వస్థలం తాడపాలెం, విశాఖ జిల్లా) రుప్పీ, (డీసీఎం-కోరాపుట్)
ఏరియా కమిటీ సభ్యులు
► బుద్రి (ఏసీఎం-ఆర్కే రక్షణ కమిటీ సభ్యురాలు, స్వస్థలం - ఛత్తీస్‌గఢ్)
► శ్వేత (విశాఖ ఏజెన్సీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు)
► మురాయ్ ►దినేష్ (ఏసీఎం, ఏవోబీ)
► రామ్‌కీ(ఏసీఎం, ఛత్తీస్‌గఢ్)
►గంగాల్ ►మల్లేష్ ►లత ► రాజన్న►సుధీర్ ►ఎర్రాలు ►రమేష్ ► జ్యోతి►జరీనా ► సురేష్
ఎన్‌కౌంటర్‌లో మరణించింది వీరే..
Published Tue, Nov 1 2016 2:53 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement
Advertisement