లోక్‌సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం సంక్షేమ పథకాల వేగాన్ని పెంచనుంది.‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’లు నిర్వహించిన
= ముస్లింలను ఆకట్టుకునేందుకు ‘నిఖా భాగ్య’
= పథకాన్ని త్వరలోపవేశపెట్టనున్న సిద్ధు సర్కార్
= పెళ్లికాని యువతులతో పాటు, వితంతువులకూ లబ్ధి
= ఎన్నికల ‘సర్వే’ అంచనాలతో ఆగమేఘాలపై నిఖా భాగ్య...
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం సంక్షేమ పథకాల వేగాన్ని పెంచనుంది.‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టీవీ’లు నిర్వహించిన ఎన్నికల సర్వేలో అధికార కాంగ్రెస్ 28 లోక్‌సభ స్థానాల్లో కనీసం సగం స్థానాలు కూడా గెలుచుకోవ డం గగనమేన ని తేల్చి చెప్పడంతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాష్ర్టంలో మొన్ననే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎన్నికల సర్వేతో కంగుతిన్న ఆ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం ఆఘమేఘాలపై ప్రణాళికలు రచిస్తోంది.
అందులో భాగంగా మైనారిటీలకు ముఖ్యంగా ముస్లిం వర్గీయులను మచ్చిక చేసుకోవ డానికి ‘నిఖా భాగ్య’ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకం వ ల్ల పేద ముస్లింకుటుంబాల్లోని పెళ్లికాని యువ తులతో పాటు, వితంతువులకు ప్రయోజనం కలగనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఏడాదికి రూ.1.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నముస్లిం కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే యువతికి 18 ఏళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలనే నిబంధన విధించారు. అంతేకాకుండా లబ్ధిదారులు రాష్ట్రంలోనే జన్మించి ఉండాలని లేదా దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం వ ుూడేళ్ల నుంచి కర్ణాటకలోనే నివ శిస్తూ ఉండాలనే నిబంధన కూడా ఉంది. నిఖాభాగ్య లబ్ధిదారులకు మొత్తంగా రూ. 50 వేలు విలువ చేసే వస్తువులు అందజేస్తారు. అందులో భాగంగా నగదు రూపంగా రూ. 15 వేలు ఇస్తారు. రాష్ట్ర జనాభాలో 12.23 శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు. ఉత్తర కర్ణాటకలోనే ఈ జనాభా ఎక్కువగా ఉంది.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ 28 పార్లమెంటు స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోలేదనే సర్వేలు వెలువడుతున్న తరుణంలో తన ఓటు బ్యాంకును నిలుపుకొనేందుకే ‘నిఖాభాగ్య’ను అమల్లోకి తీసుకువస్తోందనేది రాజకీయ విశ్లేషకుల భావన.
రేషన్ షాపుల ద్వారా పప్పుధాన్యాలు కూడా!
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు (బీపీఎల్) చౌకదుకాణాల ద్వారా కందిపప్పు, పెసరపప్పు, శెనగ వంటి పప్పు ధాన్యాలను కూడా అందించాలని ఇక్కడి ప్రభుత్వం భావిస్తోంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా రూపొందించిన మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడం, ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉండటంతో రానున్న డిసెంబర్ లేదా జనవరి నుంచి సబ్సిడీ ధరలకు పప్పుధాన్యాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందింగా సంబంధిత ప్రభుత్వ శాఖలకు అదేశాలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.