విధానసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా రోహిణీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: విధానసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా రోహిణీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎంపికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన గుప్తాను పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులు ... శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేశారు. కాగా 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ విధానసభలో 67 మంది ఆప్‌కు చెందినవారే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ముగ్గురే విజయం సాధించారు. సంఖ్యాబలం బాగా స్వల్పంగా ఉన్న కారణంగా రాజ్యాంగపరంగా బీజేపీకి ప్రతిపక్ష దక్కే అవకాశం లేదు.