రేపే పోలింగ్ | yercaud by -elections polling on Wednesday | Sakshi
Sakshi News home page

రేపే పోలింగ్

Published Tue, Dec 3 2013 12:38 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

సేలం జిల్లా ఏర్కాడు నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో భాగంగా సోమవారం ప్రచారహోరుకు తెరపడింది. దాదాపు నెలరోజుల పాటూ వాగ్దానాలు, విమర్శనాస్త్రాలతో ఊదరగొట్టిన నేతలు పోలింగ్

సేలం జిల్లా ఏర్కాడు నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో భాగంగా సోమవారం ప్రచారహోరుకు తెరపడింది. దాదాపు నెలరోజుల పాటూ వాగ్దానాలు, విమర్శనాస్త్రాలతో ఊదరగొట్టిన నేతలు పోలింగ్ వ్యూహాల్లో మునిగిపోయారు. ప్రత్యర్థులు పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులతో మంత్రి, ఎంపీ సహా 61 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పోలింగ్ నిర్విహంచనున్నారు. 
 
చెన్నై, సాక్షి ప్రతినిధి: జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏర్కాడు పోటీ నుంచి వైదొలగడంతో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్యనే ద్విముఖ పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నేతలు నియోజకవర్గంలో తిష్టవేసి అభ్యర్థుల గెలుపుకోసం ప్రచా రం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా నే సీఎం జయ మంత్రివర్గ సభ్యులతో ప్రచార బృందాన్ని నియమించారు. ఈనెల 28వ తేదీన జయలలిత సుడిగాలి పర్యటన చేయగా, డీఎంకే తరపున పార్టీ కోశాధికారి స్టాలిన్‌తోపాటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. 
 
పచారానికి చివరిరోజైన సోమవార మంత్రులు పన్నీర్ సెల్వం, నత్తం విశ్వనాథన్, ఆర్ వైద్యలింగం, ఏ పళనిస్వామి, ఆర్ మోహ న్, వలర్మతి, పళనియప్పన్ తదితరులు నియోజకవర్గంలో పర్యటించారు. స్టాలిన్ సైతం 4 గంటలవరకు ప్రచారం చేశారు. మైకులతో హోరెత్తిన నియోజవర్గంలో నిశ్శబ్దం తాండవం చేస్తూ ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెల కొంది. 5 గంటలు దాటిన తరువాత ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే హెచ్చరించిం ది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు వెంటనే నియోజకవర్గాన్ని విడిచివెళ్లాలని ఆదేశించింది. నాలుగు ప్రత్యేక బృందాలు నియోజకవర్గంలోని అతిథిగృహాలు, కల్యాణ మండపాలు, నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు టాస్మాక్ దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇరుపక్షాలపై కేసులు: ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు మేరకు మొత్తం 61 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాళప్పాడి సమీపం అనుప్పురం రాజపాళెయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఓటర్లకు ఇటీవల డబ్బులు పంచుతుండగా డీఎంకేవారు అడ్డుతగిలారు. ఈ సంఘటనలో ఇరపక్షాలు బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడి ఆస్పత్రుల్లో చేరా రు. దీనిపై మంత్రి రాజేంద్రబాలాజీ సహా 30 మంది అన్నాడీఎంకే కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా డీఎంకే నేతలు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని 31 మందిపై కేసులు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement