తమిళనాట వైఎస్ వర్ధంతి
Published Tue, Sep 3 2013 6:33 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
జన హృదయనేత వైఎస్‌ఆర్‌కు తమిళనాట అభిమానులు జోహార్లు అర్పించారు. ఆయన సేవలను ఘనంగా కొనియాడా రు. చెన్నైలోని రాయపురంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుని సన్నిధిలో పూజలు, అభిషేకాలు చేశారు.
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకు ఇక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వైఎస్ జయంతి, వర్ధంతులను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ నాలుగో వర్ధంతిని చెన్నైలో సోమవారం నిర్వహించారు. అభిమానులు ఆయూ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ చిత్రపటాలను ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు ఆయన చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. చెన్నైలోని రాయపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు ఏకే జాకీర్ హుస్సేన్, పెరంబూరు కె.శరవణన్, కెప్టెన్ కె.మణివన్నన్, కేబుల్ బాలు, ఎం.సతీష్, బాలాజీ, కార్తీక్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సీఎస్‌ఐ నార్త్ విక్ స్కూల్‌లో మహానేత వర్ధంతి నిర్వహించారు.
దివంగత నేత చిత్రపటం వద్ద అక్కడి విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరాహారదీక్షతో ఆస్పత్రిలో ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆరోగ్యవంతుడిగా ప్రజల్లోకి రావాలని, ఆయన చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రార్థిం చా రు. అలాగే సీఎస్‌ఐ నార్త్ విక్ స్కూల్‌లో పీజీ అసిస్టెంట్లు గ్లోరి సెల్వకుమారి, సింధియా నేతృత్వంలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరిగారుు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు. పెరంబూరు నుంచి వచ్చిన తెలుగువారు లక్ష్మి, కల్యాణి, నిర్మల, కావ్య మహానేత చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి ఆ దేవుడు అండగా ఉండాలని, మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు.
ప్రతి ఏటా వేడుకలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తమిళనాడు విభాగం నేతృత్వంలో ప్రతి ఏటా మహానేత వర్ధంతి, జయంతి నిర్వహిస్తున్నామని నేతలు ఏకే జాకీర్ హుస్సేన్, పెరంబూరు కె.శరవణన్ అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్‌ఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. మంచి చేయడం, చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయన నైజమన్నారు. తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సీపీని ఏర్పాటు చేసిన జగన్‌మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. తమకు తెలుగు రానప్పటికీ ఆ మహానేత అన్నా, ఆయన కుటుంబం అన్నా ఎంతో అభిమానమని తెలిపారు. మహానేత ఆశయాలు నెరవేరాలన్నా, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నా జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.
ప్రత్యేక పూజలు
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరున ప్రత్యేక పూజలు జరిగాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తనయుడు వినోద్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అభిమానులు ఈ పూజలకు ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే ఆలయంలో రాజన్న పేరిట విశిష్ట పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే చెన్నైలోని సాక్షి కార్యాలయంలో వైఎస్‌ఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
నేడు సంస్మరణ సభ
చెన్నైలో మంగళవారం వైఎస్‌ఆర్ సంస్మరణ సభ జరగనుంది. టీ.నగర్, సారంగపాణి వీధిలోని ఆల్ ఇండియా కమ్మ నాయుడు సంఘం ఈ సభకు వేదిక కానుంది. సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ సంస్మరణ సభకు అభిమానులు తరలిరావాలని వైఎస్‌ఆర్‌సీపీ తమిళనాడు విభాగం పిలుపునిచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు, రోజా, విజయ్‌చందర్, మారెప్ప, రెహ్మాన్, పి.గౌతంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొడాలి నాని, తూము రామిరెడ్డి తదితరులు హాజరుకానున్నారని పేర్కొంది.
Advertisement