స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..? | technology addiction leads to depression, anxiety say researchers | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..?

Published Thu, Apr 13 2017 8:23 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..? - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..?

ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నారా? అయితే మీకు వ్యక్తిగతంగా, పనిచేసే ప్రదేశాల్లో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిన వారిని... ‘ఎక్కువగా ఒంటరిగా ఉండడం, ఆందోళనగా ఉండడం, ఒత్తిడికి లోనవడం’ వంటి లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. ‘మనం ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు అప్పటికప్పుడు సంతృప్తినిచ్చే ఒక ఉత్ప్రేరకంగా మారాయి’అని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌కి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఐజక్‌ వాగేఫి తెలిపారు.

‘అతిగా సోషల్‌ మీడియాను ఉపయోగించడం, ఆఫర్ల పేరిట గంటల తరబడి ఆన్‌లైన్‌ షాపింగ్‌లలో ఉండడం, అదే పనిగా వీడియో గేమ్‌లు, వీడియోలు చూడడం’ వంటి లక్షణాలన్నింటినీ కలిపి సాంకేతిక పరిభాషలో ‘టెక్నాలజీ అడిక్షన్‌’గా పిలుస్తారు. పరిశోధనల్లో భాగంగా 182 కళాశాలకు చెందిన విద్యార్థులను ఎంచుకుని వారి రోజువారి స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది స్మార్ట్‌ ఫోన్‌ దగ్గర్లో లేకపోతే ఆత్రుతకు, ఒత్తిడికి గురయ్యారని పరిశోధకులు తెలిపారు. ‘మీరు ఫోన్‌ రింగ్‌ అవ్వకున్నా, మాటిమాటికి ఫోన్‌ వైపు చుస్తూన్నారా? స్మార్ట్‌ ఫోన్‌ దగ్గర లేకపోతే ఆందోళనకు గురవుతున్నారా..? అయితే వెంటనే మంచి వైద్యుని దగ్గరికి వెళ్లండి’. అని పరిశోధకులు సూచిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement