12,66,720 | 12,66,720 | Sakshi
Sakshi News home page

12,66,720

Published Thu, Aug 21 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

12,66,720

12,66,720

- లెక్క తేలిన కుటుంబాల సంఖ్య   
- మూడేళ్లలో 29.87% పెరుగుదల
- నూటికి 104.45 % దాటిన సర్వే    
- మొత్తం 104.45% కుటుంబాల సర్వే
- ఎలిగేడు, మహదేవ్‌పూర్‌లో తగ్గిన శాతం

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఒక్క రోజు సమగ్ర సర్వేతో జిల్లాలోని కుటుంబాల సంఖ్య నిక్కచ్చిగా లెక్క తేలింది. మొత్తం 12,66,720 కుటుంబాలున్నట్లు వెల్లడైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,76,022 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అప్పటితో పోలిస్తే మూడేళ్ల వ్యవధిలో 29.87 శాతం కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. కరీంనగర్ డివిజన్‌లోఅత్యధికంగా 35.28 శాతం, సిరిసిల్ల డివిజన్‌లో 34.50 శాతం కుటుంబాల సంఖ్య పెరిగినట్లు లెక్కతేలింది. ముందుగా గుర్తించిన కుటుంబాలతో పోలిస్తే సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో...  జిల్లాలో 104.45 శాతం సర్వే పూర్తయినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. సర్వేకు సంబంధించి ఇంటి నంబర్లు వేసే సమయంలో జిల్లాలో 12.12 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీరా.. సర్వే చేసే సమయానికి ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

మొత్తం 12,66,720 కుటుంబాల వివరాలను సర్వే సిబ్బంది నమోదు చేశారు. తమ ఇంటి నంబర్లు గల్లంతయ్యాయని చాలా కుటుంబాలు అప్పటికప్పుడు నంబర్లు వేయించుకుని తమ వివరాలు నమోదు చేయించటం... దూరప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది కుటుంబాలు అదే రోజున సర్వేలో ఎంట్రీ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముందుగా నంబర్లు వేయనప్పటికీ.. అడిగిన వారందరికీ తక్షణమే నంబర్లు కేటాయించి వివరాలు నమోదుకు జిల్లా యం త్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేయటంతో సర్వే సంపూర్ణమైంది. గంగాధర మండలంలో అత్యధికంగా 109 శాతం, చొప్పదండి, భీమదేవరపల్లి, రాయికల్, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో 108 శాతం సర్వే జరిగింది.

 ముందుగా అధికారులు గుర్తించిన కుటుంబాల కంటేతక్కువగా ఎలిగేడు మండలంలో కేవలం 95.39 శాతం, మహదేవ్‌పూర్ మండలంలో 98.55 శాతం కుటుంబాలు తమ వివరాలు నమోదు చేయించటం గమనార్హం. ఇబ్రహీంపట్నం మండలంలో పక్కాగా నూటికి నూరు శాతం సర్వే జరగ్గా... జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో వంద శాతానికి మించి సర్వే జరిగినట్లు అధికారులు ప్రకటించారు. రామగుండంలో 105 శాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 40,424 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాలుపంచుకున్నారు.
 
ఇక డాటా ఎంట్రీ
సర్వే ద్వారా సేకరించిన కుటుంబాల వివరాలు డాటా ఎంట్రీ చేసేందుకు జిల్లాలో దాదా పు మూడు వేల కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. మంథని, కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 300 కంప్యూటర్లను డాటా ఎంట్రీకి వినియోగిస్తున్నారు. వీటికి తోడుగా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, పట్టణ ప్రాంతాల్లో ఆర్డీవో కార్యాలయాలు, మండలాల్లో తహసీల్ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకి ప్రత్యేకంగా కంప్యూటర్లను సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement