మిగిలింది 3 రోజులే..
హన్మకొండ అర్బన్: పింఛన్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఫాస్ట్ పథకం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం విధించిన గడువు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ లోపు దరఖాస్తు చేసుకుంటేనే.. పరిశీలించి అర్హులకు పథకాలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల స్పష్టం చేశారు.
ఈ మేరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో పలువురు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. కానీ.. పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో పల్లెలతోపాటు పట్టణాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం స్వీకరిస్తున్న దరఖాస్తులు ఎందుకనే విషయమై ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం తోపాటు జిల్లా యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకాలకు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకే ఇలాంటి చర్యలు చేప డుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్పష్టత కరువు
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్వయంగా ప్రకటించినప్పటికీ సకాలంలో జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేద ని అధికారులంటున్నారు. దరఖాస్తులు స్వీకణ, జాబితా తయారీ తదితర విషయాలకు సంబంధించి శనివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు అందాయని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాల ప్రకారం పథకాలకు సంబంధించి అధికారులు ఇదివరకే పనులు మొదలు పెట్టా రు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. గ్రామాల్లో కొన్నిచోట్ల దండోరా వేయిం చినా సమాచారం విషయంలో స్పష్టత లేకపోవడం మరింత గందరగోళానికి గురిచేస్తోంది.
ఏర్పాటుకాని ప్రత్యేక బృందాలు
కార్యక్రమం పర్యవేక్షణ కోసం డివిజన్ స్థాయి లో సబ్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు ఏర్పా టు కాలేదు. దరఖాస్తులు చేసే విషయంలో సందేహాలుంటే ఎవరిని సంప్రదించాలో తెలి యని పరిస్థితి ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకునే సిబ్బంది కూడా ఈవిషయంలో పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
10 లక్షల కార్డులు...
జిల్లాలో ప్రస్తుతం 10 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో బోగస్ సుమారు 10 శాతం తీసేసినా... 9 లక్షల దరాఖాస్తులు అధికారులకు అందాలి. అదేవిధంగా జిల్లాలో 3,90,000 మందికి వివిద రకాల పింఛన్లు అం దుతున్నాయి. వీటికి తోడు మరో 30వేల దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అంటే సుమారు 4,00,000 మందికి పైగా లబ్ధిదారులు మళ్లీ దర ఖాస్తులు అందజేయాలి.
ఇప్పటివరకు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై జిల్లాలోని సుమారు 30 మండలాల నుంచి డీఆర్‌డీఏ పింఛన్ విభాగం అధికారులు సమాచారం సేకరించారు. ఆదివారం సాయంత్రం వరకు 80వేల వరకు మాత్రమే దరఖాస్తులు అందాయి. ఆహార భద్రత కార్డుల విషయంలో సెలవుదినం కావడంతో సోమవా రం వివరాలు సేకరిస్తామని అధికారులు తెలి పారు. దీంతో ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తికావడం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేయూలి...
ప్రస్తుతం అధికారులు తీసుకుంటున్న దరఖాస్తులను ఈనెల 15 నుంచి కుటుంబసర్వే వివరాల ఆధారంగా పరిశీలన చేస్తామని, ఆధార్ నంబర్ ఆధారంగా వివరాలు సరిచూసి అర్హులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం జిల్లాకు కుటుంబ సర్వే వివరాలు అందజేస్తామని న్నతాధికారులు చెప్పినప్పటికీ... ఆదివారం సాయంత్రం వరకు ఎస్‌కేఎస్ వివరాలు అందలేదు.
ఇక వచ్చిన దరఖాస్తులు ఒక్కోటి పరిశీలించి ఎస్‌కేఎస్ వివరాలతో సరిచూడడం అంతతొందరగా పూర్తయ్యే పనికాదు. సోమవారం నుంచి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికేనా యంత్రాంగం స్పందించి గ్రామాల్లో , నగరంలో హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేయడం, ప్రచారం వంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలు పూర్తిస్థారుులో దరఖాస్తు చేసుకునే అవ కాశం ఉంది.