నల్గొండ జిల్లా దిండి మండలకేంద్రంలో పోలీస్‌స్టేషన్ చౌరస్తా వద్ద 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దిండి : నల్గొండ జిల్లా దిండి మండలకేంద్రంలో పోలీస్‌స్టేషన్ చౌరస్తా వద్ద 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోలెరో వాహనంలో దిండి నుంచి కల్వకుర్తి తరలిస్తుండగా బియ్యాన్ని పట్టుకున్నారు. డ్రైవర్‌ను, క్లీనర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.