నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని గురుకుల బాలికల విద్యాలయంలో ఆహారం వికటించి 30 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం ఆహారంలో భాగంగా చికెన్ వడ్డించడంతో అది వికటించి 30 మందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో శనివారం వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.