ఆ 43 మందికి 'సింగరేణి'నివాళి | A tribute to those 43 workers | Sakshi
Sakshi News home page

ఆ 43 మందికి 'సింగరేణి'నివాళి

Published Sat, Oct 24 2015 12:08 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

A tribute to those 43 workers

స్ట్రాట్ పిట్ ఇంక్లయిన్ లో గ్యాస్ లీకై మరణించిన కార్మికులను సింగరేణి స్మరించుకుంది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో 1938 సంవత్సరం మొహరం పండుగ రోజు జరిగిన ఈ ప్రమాదంలో 43 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతికి నివాళిగా.. శనివారం సింగరేణి సెలవు ప్రకటించింది.

ఇల్లెందులోని 24 ఏరియాలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో జీఎం రాజేశ్వర్‌రెడ్డి సహా కార్మికులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... నాడు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల సేవలను సింగరేణి ఎన్నటికీ మరచి పోదన్నారు.  ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేని నాటి రోజుల్లో కార్మికులు అందించిన సేవల వల్లే సింగరేణి సంస్థ ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement