బతుకమ్మ పూల కోసం వెళ్లి వ్యక్తి మృతి..
బతుకమ్మ పండుగ ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామంమానికి చెందిన బొగ్గం రామారావు పూల కోసం చెరువులోకి దిగి మృతి చెందాండు. మంగళవారం ఉదయం.. ఈఘటన జరిగింది. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాద వశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.