ఖమ్మం సిటీ: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అండగా ఉండడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టిం దని, ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బం గా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలో నిరుపేదలు, నిర్భాగ్యులకు కనీసం ఒక్క పూట భోజనం ఖర్చు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రూ.200 కనీసం వారికి మందుల ఖర్చుకు కూడా సరిపోవడం లేదని, అందుకే పింఛన్‌ను రూ.1000కి పెంచామని చెప్పారు. దీంతో ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానాపై సుమారు రూ.4 వేల కోట్ల భారం పడుతుందన్నారు.
ఈ నెల పింఛన్‌ను నగదు రూపంలో చెల్లిస్తామని, వచ్చేనెల నుంచి లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేస్తామని చెప్పారు. పింఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు చేసుకోవాలని సూచిం చారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. ఇంత పెద్ద కార్యక్రమా న్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం గర్వం గా ఉందన్నారు. అనంతరం వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు అందించా రు. జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడు తూ పింఛన్ల పంపిణీ ఒక బృహత్తర కార్యక్రమమన్నారు.
వృద్దులు, వికలాంగుల పరిస్థితి దయనీయంగా మారకుండా ఉండేం దుకే ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, దీన్ని అరికట్టాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ జిల్లాలో 3,14,214 దరఖాస్తులు వచ్చాయని, అందులో 2.20లక్షల మందికి పింఛన్లు మంజూ రు చేసినట్లు తెలిపారు. రేషన్ సరుకుల కోసమే ఆహార భద్రత కార్డులు ఇస్తున్నామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ పింఛన్ల పెంపు నిర్ణయం హర్షణీయమన్నారు.
గతంలో ఖమ్మం నగరంలో14 వేల పింఛన్లు ఉండగా, ఈసారి 27వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 8వేల మంది నే సర్వే చేశారని, అందులో నాలుగు వేలమందిని మాత్రమే పింఛన్లకు అర్హులుగా గుర్తించారని వివరించారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ వేణుమనోహర్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్, రఘునాధపాలెం ఎంపీపీ మాలోతు శాంత, తహశీల్దార్ వెంకారెడ్డి, కార్పొరేషన్ మేనేజర్ రాజారావు, డీఈలు రామన్, వెంకటశేషయ్య పాల్గొన్నారు.
అర్హులందరికీ ‘ఆసరా’
Published Sun, Nov 9 2014 4:03 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement