The distribution of pensions
-
రేషన్ డీలర్ల ద్వారా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ
అమరావతి: రేషన్ డీలర్ల ద్వారా వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ గురువారం రేషన్ డీలర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మార్చి లేదా ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారానే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు డీలర్లకు హామీ ఇచ్చారని సమాచారం. -
ఆధార్... బేజార్!
గుంటూరు వెస్ట్ : ఆధార్ సీడింగ్ సక్రమంగా నమోదుకాకపోవడంతో అక్టోబర్ నెలకు సంబంధించి జిల్లాలో 6,649 మంది పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. వారందరికీ నగదు మంజూరు అయినప్పటికీ సరైన ఆధార్ సంఖ్య సీడింగ్ కాకపోవడంతో అధికారులు పంపిణీ నిలిపివేయాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వారి సంఖ్య 1.23 లక్షలు ఉండడం గమనార్హం! ఎన్టీఆర్ భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి ఆధార్ సీడింగ్ ఇబ్బందులను తెచ్చిపెడుతున్నది. జిల్లాలోని 411 మంది డూప్లికేట్ ఆధార్‌ను అందించారు. ఒకే ఆధార్ సంఖ్య ఇద్దరు, ముగ్గురికి నమోదుకావడంతో 1,900 మందికి పింఛన్ నిలిపివేశారు. అదేవిధంగా 4,348 మందికి ఆధార్ లేకపోవడంతో పింఛన్ నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య పింఛన్లు ఎన్‌ఓఏపీఎస్ స్కీమ్ కింద 81,899 మందికి రూ.8.18 కోట్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రబడ్జెట్లో 86,894 మందికి రూ.8.68 కోట్లు అందిస్తున్నారు. చేనేత కార్మికులు 6,588 మందికి రూ.65.88 లక్షలు, వితంతువులు 1,30,010 మందికి రూ.13 కోట్లు, అభయహస్తం కింద 23,238 మందికి రూ. 2.32 కోట్లు, 40 నుంచి 79 శాతం లోపు అంగవైకల్యం కలవారు 33,562 మంది ఉండగా వారికి రూ.3.35 కోట్లు, 80 శాతం పైబడి అంగవైకల్యం కలవారు 9,880 మంది ఉండగా వారికి రూ.1.48 కోట్లు, కల్లుగీత కార్మికులు 892 మందికి రూ. 8.92 లక్షలు పంపిణీచేస్తున్నారు. మొత్తంగా 3,72,963 మంది పింఛన్‌దారులకు రూ.37.79 కోట్లు అందజేస్తున్నారు. మూడు నెలలకొకసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండడంతో పింఛన్‌దారుల సంఖ్య పెరుగుతుంటుంది. సెర్ప్ సీఈవో ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల జరగాల్సిన పంపిణీలో 1.23 లక్షల మంది ఫించన్‌దారులకు సరైన ఆధార్ సీడింగ్ లేకపోవడంతో మేలుకున్న ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈమేరకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ(సెర్ప్) రాష్ట్ర సీఈవో ఎస్.సాల్మన్అరోక్జరాజ్ జిల్లాలకు సమాచారం అందించారు. ఎంపీడీవోలు పోర్ట్ నుంచి ఆధార్ సీడింగ్‌లో జరిగిన లోపాలను సరిచేసి పింఛన్లు పంపిణీ జరిగేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ఆధార్ లేనిపక్షంలో అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి వాయిస్ ఎస్ఎంఎస్లు డిసెంబర్ నుంచి పింఛన్‌దారుల సెల్ఫోన్లకు వాయిస్ ఎస్ఎంఎస్లు పంపించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని పింఛన్‌దారుల నుంచి 50 శాతం మంది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. పింఛన్‌దారులకు ఒకవేళ నంబర్ లేకుంటే తమ సమీప బంధువులు, ఇంటిపక్క వారి నంబర్లు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్లు పంపిణీకి ముందు సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు వచ్చేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
అదనపు సిబ్బందితో కార్యదర్శుల భర్తీకి చర్యలు నిరుద్యోగుల ఆందోళలను పట్టించుకోని సర్కారు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ప్రభుత్వ శాఖల్లో అదనపు సిబ్బందిని గుర్తించి ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో నియమించేందుకు చర్యలు చేపట్టింది. విశాఖపట్నం : జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. వీటిలో 37 మేజర్ పంచాయతీలుండగా మిగిలినవి మైనర్ పంచాయతీలు. మేజర్, మైనర్ పంచాయతీలను కలిపి 558 క్లస్టర్స్‌గా విభజించారు. మేజర్ పంచాయతీలకు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లు, మైనర్ పంచాయతీలకు కార్యదర్శులుండాలి. 558 క్లస్టర్స్‌కు 558 మంది కార్యదర్శులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 393 మంది మాత్రమే ఉన్నారు. 165 క్లస్టర్స్‌కు కార్యదర్శులు లేనేలేరు. ఒక్కో కార్యదర్శి రెండు మూడు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై పని ఒత్తిడి పెరిగిపోయింది. ఇటీవల పింఛన్ల పంపిణీని కూడా కార్యదర్శులకు అప్పగించడంతో రోజువారీ కార్యకలాపాలపై వారు ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదు. దీంతో పన్నుల వసూళ్లు, ధ్రువీకరణ పత్రాల జారీపై తీవ్ర జాప్యం జరుగుతోంది. పంచాయతీలకు ఇన్చార్జి కార్యదర్శులు చుట్టపు చూపుల్లా వచ్చి వెళ్తున్నారే తప్ప ఈ ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదు. ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోని సర్కార్ భారం తగ్గించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని గుర్తించి వారిని కార్యదర్శులుగా పంచాయతీలకు పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం శాఖల వారీగా అదనపు సిబ్బందిని గుర్తించే పనిలో పడింది. ఆసక్తి ఉన్న వారితో జాబితాలివ్వండి కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ మేరకు శాఖాధిపతులకు సోమవారం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. శాఖల వారీగా ఏఏ కేడర్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు? అదనంగా ఉన్న సిబ్బంది ఎంతమంది? వారిలో పంచాయతీ కార్యదర్శులుగా వెళ్లేందుకు ఆసక్తి ఉన్న వారెంతమంది? వంటి వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ జాబితాలను సిద్ధం చేసి డిసెంబర్‌లోగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో నింపేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. రికార్డు అసిస్టెంట్ మొదలు సీనియర్ సహాయకులు వరకు, ఆసక్తి ఉంటే సూపరింటెండెంట్ ఉద్యోగులు సైతం కార్యదర్శులు, ఈవోలుగా పనిచేయడానికి అర్హులుగా నిర్ధారించారు. డిగ్రీ చదివి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే డిప్యుటేషన్‌పై కార్యదర్శిగా వెళ్లడానికి అనుమతివ్వనున్నట్టు ప్రకటించారు. -
అభయం
అభయహస్తం పింఛన్ల పంపిణీలో గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పింఛన్లను జనవరి రెండో వారం నుంచి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలందడంతో జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముకరంపుర : జిల్లాలో 41,603 మంది లబ్ధిదారులకు నెలనెలా రూ.500 అందించేవారు. నెలకు రూ.2.08 కోట్లు అవసరమయ్యేవి. ఆసరా పింఛన్లతో ముడిపెట్టడంతో అక్టోబర్ నుంచి అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు రోజుకు రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండే వరకు సభ్యులు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు పూర్తయ్యాక సభ్యులకు నెలకు రూ.500 నుంచి రూ.2200 వరకు పింఛన్ అందిస్తారు. దీనికి ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు స్కాలర్షిప్ కూడా అందిస్తారు. ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున ఆసరా పేరిట అక్టోబర్ నుంచి అందిస్తోంది. ఆసరా పింఛన్ల లబ్ధిదారులు అభయహస్తంలోనూ ఉన్నారని విచారణ పేరిట వీరికి మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతమందికో అభయ‘హస్తం’ అభయహస్తంలో పింఛన్లు పొందుతూ 65 ఏళ్ల వయసున్న పలువురు ఆసరా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించి మంజూరు కూడా చేశారు. అసరా పింఛన్ వచ్చే వారికి అభయహస్తం పెన్షన్ రద్దు చేస్తారు. ఇలాంటివారి సంఖ్య తేల్చేందుకే ఇంతకాలం విచారణ చేశారు. ‘ఆసరా’ లబ్ధిదారులు లెక్కతేలడం, వారికి పంపిణీ కూడా మొదలవడంతో వీరిలో అభయహస్తం లబ్ధిదారులు ఎందరున్నారో త్వరగానే తేలనుంది. వీరి జాబితా సిద్ధం చేసి పింఛన్లు అందించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలివ్వడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాబితా సిద్ధమయ్యాక జనవరి 15 నుంచి అభయహస్తం పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పింఛన్ మొత్తం పెంచాలని యోచించినా... చివరకు పాత పద్ధతిలోనే నెలకు రూ.500 చొప్పున పంపిణీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ మొత్తం రూ.1500 లబ్ధిదారులు ఒకేసారి అందుకోనున్నారు. అభయహస్తం, పింఛన్ల పంపిణీ, అధికారులు, Assurances, the distribution of pensions, the -
లబ్..డబ్
32వ డివిజన్ పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో వృద్ధురాలి మృతి వారం వ్యవధిలో ఇద్దరి కన్నుమూత పోస్టాఫీసులు, పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద వేకువజాము నుంచే క్యూ అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు పట్టించుకోని పాలకులు, అధికారులు విజయవాడ సెంట్రల్/చిట్టినగర్ : సామాజిక పింఛన్లు పేదల ప్రాణాలు తీస్తున్నాయి. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము 3 గంటల నుంచి లబ్ధిదారులు పోస్టాఫీసుల వద్ద బారులుతీరుతున్నారు. టోకెన్ల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజుల క్రితం 49వ డివిజన్లో జైనాబీ(75) అనే వృద్ధురాలు పింఛను పోరులో అలసి తనువుచాలించింది. సోమవారం కూడా 32వ డివిజన్లో పడాల కాంతమ్మ (68) అనే వృద్ధురాలు తొక్కిసలాట కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు. చిట్టినగర్ ఈద్గారోడ్డులోని పింఛన్ల కేంద్రం వద్ద పింఛన్ల కూపన్లు పంపిణీ చేస్తారని స్థానిక కార్పొరేటర్ చెప్పడంతో సోమవారం ఉదయం 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో వృద్ధులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో 5.30 గంటల సమయంలో జరిగిన తొక్కిసలాటలో పడాల కాంతమ్మ కిందపడిపోగా, ఆమెపై మరో ఇద్దరు పడ్డారు. గాయపడిన కాంతమ్మను ఆమె కుమార్తె ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలు పార్టీల నాయకులు సొరంగం రోడ్డులో మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. నిత్యం పోస్టాఫీసులు, పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరుగుతున్న తోపులాటల్లో అనేక మంది వృద్ధులు, వికలాంగులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నప్పటికీ అధికారులు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై జనం మండిపడుతున్నారు. ఎన్ని తిప్పలో.. నగరపాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో 11,777 మంది వృద్ధులు 4,545 మంది వికలాంగులు, 16,547 మంది వితంతువులు, 21 మంది చేనేత కార్మికులు పింఛన్లు పొందుతున్నారు. వీరితోపాటు 825 మంది అభయహస్తం పింఛనుదారులు ఉన్నారు. మొత్తం 33,715 మందికి గానూ, 30 సబ్ పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు డివిజన్లకు ఒకే పోస్టాఫీసులో పింఛన్లు అందించడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. పోస్టాఫీసుల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పంపిణీ లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పింఛన్లకు ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే లైనులో నిలుచుంటున్నారు. జాబితాల్లో తప్పుల వల్లే ఇక్కట్లు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్(యూసీడీ) విభాగం నుంచి పోస్టాఫీసులకు చేరిన జాబితాల్లో తప్పులు దొర్లడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. 55వ డివిజన్లో వికలాంగుడైన యశ్వంత్ వేలిముద్రలు సరిగా పడలేదని పింఛన్ నిలిపివేశారు. మరొకరికి ఒక చేయి లేదు. పది వేలిముద్రలు పడితేనే పింఛన్ అని అధికారులు చెప్పడంతో వికలాంగులు నానా పాట్లూ పడుతున్నారు. రూ.లక్ష అందిస్తాం : బుద్దా వెంకన్న : పడాల కాంతమ్మ కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ప్రకటించారు. గుంటూరు పర్యటన నిమిత్తం ఈ నెల 24ననగరానికి రానున్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని చెప్పారు. రెచ్చగొట్టే వాళ్ల మాటలు నమ్మొద్దు లబ్ధిదారులను కొందరు రెచ్చగొడుతున్నారు. వాళ్ల మాటలు వినడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. పోస్టాఫీసుల్లో రోజుకు వంద మందికి పింఛన్లు ఇస్తారు. వెయ్యి మందికి ఇవ్వలేరు కాదా.. పరిస్థితిని లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి. పింఛన్ల పంపిణీలో అన్యాయం జరిగితే నా వద్దకు, లేదా కమిషనర్ వద్దకు రావొచ్చు. అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదు. - కోనేరు శ్రీధర్, నగర మేయర్ డోర్ టు డోర్ పంపిణీ చేయాలి పింఛన్లను డోర్ టు డోర్ పంపిణీ చేయాలి. అలా చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. కరెంట్ బిల్లు, ఆస్తి పన్ను వంటిని ఇంటికి వెళ్లి ఇస్తున్నప్పుడు పింఛను ఇస్తే తప్పేంటి. అది సాధ్యం కాదనుకుంటే డివిజన్ల వారీగా అయినా పంపిణీ చేయాలి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు మొద్ద నిద్ర పోతున్నారు. కాంతమ్మ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి ప్రభుత్వమే బాధ్యత వహించాలి నగరంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. లబ్ధిదారుల ప్రాణాలు పోతున్నా పాలకులు, అధికారులు స్పందించకపోవడం దారుణం. జాబితాలు పోస్టాఫీసులకు ఇచ్చి కార్పొరేషన్ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారు. కాంతమ్మ మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆమె కుటుంబాకి రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. - పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ -
పెన్షన్... టెన్షన్...
-
పెన్షన్... టెన్షన్...
మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ బ్యాంకుల్లో జమకాని నగదు మంత్రుల కోసం మరి కొన్ని చోట్ల వాయిదా లబ్ధిదారుల పడిగాపులు సిటీబ్యూరో: నగరంలో బుధవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. అనేక ప్రాంతాల్లో విచారణ పూర్తి కాకపోవడం... అందరికీ మంజూరు కాకపోవడం... ప్రజల నిరసనలతో ఈ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. రోజంతా ఎదురు చూసి విసిగి వేసారిన లబ్ధిదారులు నిరాశతో ఇంటిముఖం పట్టారు. గ్రేటర్‌లోని మారేడుపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలాలు, ఎల్బీనగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు. మారేడుపల్లి, ముషీరాబాద్‌లకు సంబంధించి బ్యాంకుల్లో సంబంధిత మొత్తం జమ కాకపోవటంతో పంపిణీ చేయలేదు. సికింద్రాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 10 నుంచి రెండు నెలల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో గ్రేటర్‌లోని పింఛన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బుధవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి ఎదురు చూశారు. అధికారులు రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఒక దశలో ఆగ్రవేశాలు వ్యక్తంచేశారు. కొన్ని కేంద్రాలలోనైతే నిరసనలకు దిగారు. ఈ పరిస్థితి సమూర్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 130 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 30 చోట్ల పంపిణీ చేయలేదు. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో త హశీల్దారుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా.. శివారు ప్రాంతాల బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. అయితే వారు దిల్షుక్నగర్ మినహాయించి ఎక్కడా పంపిణీ చేయలేదు. నగరంలో 7,900 మందికి... నగరంలో బుధవారం 7,900 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో 6,900 మందికి... శివారు ప్రాంతాల్లో వెయ్యి మందికి అందజేసినట్లు అధికారవర్గాల సమాచారం. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పింఛన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్ గ్రౌండ్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు. షేక్‌పేట మండల పరిధిలో బుధవారం మూడు చోట్ల అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడ 800 మందికి వీటిని అందజేశారు. బహదూర్‌పురా మండలంలో అత్యధికంగా పంపిణీచేసినట్లు తెలుస్తుంది. అమీర్‌పేట, అంబర్‌పేట, చార్మినార్, పాతబస్తీల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. హైదరాబాద్ జిల్లాలో దీన్ని కలెక్టర్ ముఖేష్‌కుమార్ పర్యవేక్షించారు. ఎన్ని వింతలో... ఆసరా కార్డుల్లో వింతలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని కొంపల్లిలో ఇద్దరు వితంతువులకు జారీ చేసిన ఆసరా కార్డులపై యువకుడు, పాఠశాల విద్యార్థినిల ఫొటోలు ముద్రించారు. దీంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. గుడిపల్లి ప్రమీల(38) కార్డుపై యువకుడి ఫొటో దర్శనమివ్వగా.... బాలోని నీరజ(33) కార్డుపై చిన్నారి ఫోటో ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ కె.అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా... అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఎవరిదో ఒక ఆధార్ నెంబరు ఇస్తే నోట్ చేసుకుని వచ్చి కంప్యూటర్లో పొందుపరిచారని తెలిపారు. ఈక్రమంలో తప్పులు దొర్లాయని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. ఉప్పల్‌లో సర్కిల్లోని వెంకట్‌రెడ్డి నగర్, రామాం తానపూర్లకు చెందిన వికలాంగులు ఉపేంద్ర (59), జి.మాణిక్యం(44)లకు జారీ చేసిన ఆసరా కార్డుైలపై ‘వితంతువు’గా ముద్రించారు. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఒ క్కో కార్డును పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. -
అందుకో.. ఆసరా!
నేటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం జిల్లాలో 3.54లక్షల మందికి లబ్ధి అర్హులందరికీ కార్డుల అందజేత అన్నివర్గాలతో పాటు కళాకారులకూ పింఛన్లు పంపిణీకి పోలీసు బందోబస్తు. మహబూబ్‌నగర్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ(ఆసరా)కి రంగం సిద్ధమైంది. అనేక అవాం తరాల నేపథ్యంలో అర్హులజాబితా ఓ కొలిక్కి వచ్చిం ది. జిల్లాలో మొత్తం 3.54లక్షల మందికి పింఛన్లు అందించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. గతనెల 8న సీఎం కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో లాం ఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తిస్థాయిలో పం పిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి నెలరోజుల సమయం పట్టింది. పలుమార్లు వాయిదా పడుతూ.. బుధవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సంకల్పించారు. ఈ మేరకు ఈనెల 15వ తేదీ వరకు పింఛన్లు పంపిణీచేయాలని జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇప్పటికే రూ.70కోట్లు మంజూరయ్యాయి. పంపిణీకి పోలీసుల బందోబస్తు పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పింఛన్ల మొత్తం భారీగా పెరగడంతో పాటు పంపిణీ కూడా రెండు నెలలకు కలిపి ఒకేసారి అందజేస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల నుంచి చోరీకి గురికాకుండా ఉండేం దుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయవైరుధ్యాలున్న గద్వాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గద్వాల ఆర్డీఓను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రహసనంగా సాగిన ప్రక్రియ.. పింఛన్ల పంపిణీ పథకానికి ఆదినుంచీ అడ్డుంకులు ఎదురయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీమేరకు వికలాంగులకు రూ.1,500, వృద్ధు లు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు రూ.1,000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. సామాజిక పింఛన్ల పంపిణీ అర్హులకే అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొదట నిర్ధేశించిన విధంగా దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సమగ్ర సర్వేలో పొంతన కుదరకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసి అందుకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించారు. -
రెన్నెల్లది ఒకేసారి
15లోగా పింఛన్ల పంపిణీ ఇప్పటికే 50 శాతం పూర్తి జిల్లాలో దరఖాస్తులు 5.50 లక్షలు ఎంపికైన లబ్దిదారులు 3.07 లక్షలు ఇప్పటివరకు పంపిణీ 1.68 లక్షలు ఆసరా పథకం కింద అర్హులందరికీ ఈనెల 15లోగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నేటినుంచి ఐదు రోజుల్లోగా జిల్లాలో లబ్దిదారులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. అక్టోబర్, నవంబర్ రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను ఒకేసారి అందించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకంలో అర్హుల గుర్తింపులో అనేక లోపాలు తలెత్తాయి. గతంలో పింఛన్ పొందిన వారితో పాటు వేలాది మంది కొత్త వారిని అనర్హులుగా పేర్కొనడంతో ప్రజల్లో నిరసన పెల్లుబికింది. ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెరగడంతో ఆసరా పథకంపై సర్కారు పునరాలోచనలో పడింది. పింఛన్ మార్గదర్శకాలను మార్చడంతో పాటు అర్హులందరినీ లబ్దిదారులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అనర్హులుగా పేర్కొన్న దరఖాస్తులను పునఃపరిశీలించింది. ఈ ప్రక్రియ ఓవైపు కొనసాగుతుండగానే కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. జిల్లాలో అన్ని రకాల పింఛన్ల కోసం 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఇందులో 3.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో యాభై శాతం మందికి ఇప్పటికే పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,415 మంది లబ్దిదారులకు రూ.24.35 కోట్ల నగదును పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 15లోగా పంపిణీ చేయాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 30,068 మంది లబ్దిదారులకు రూ.4.36 కోట్ల పెన్షన్ నగదు అందజేశారు. అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన రెండు నెలల పింఛన్ డబ్బులను ఒకేసారి లబ్దిదారులకు అందించారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.1000, వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున నగదు రూపంలో అందజేశారు. జాబితాలో తిరస్కరించిన వారిని పునఃపరిశీలిస్తున్నారు. అర్హులైనప్పటికీ జాబితాలో చోటు కల్పించలేదంటూ జిల్లాలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అర్హత ఉన్నా జాబితాలో చోటు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తామంటున్నారు. -
పింఛన్ల పంపిణీ ప్రశ్నార్థకం
పోస్టల్ శాఖకు బాధ్యతలు ఇప్పటి వరకు అందని మార్గదర్శకాలు ఈ నెల విడుదల కాని బడ్జెట్ లబ్ధిదారుల ఎదురు చూపు కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ బాధ్యతల నుంచి యాక్సిస్ బ్యాంకు, ఫినో కంపెనీని ప్రభుత్వం తప్పించింది. పోస్టల్ ద్వారా పంపిణీ చేపడుతామని అధికారులు చెబుతున్నా.. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ నెలలో పింఛన్ల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మొత్తంగా మూడు లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. నవంబర్ నెలలో పది రోజులు గడిచిపోయినా.. ఇందుకు సంబంధించిన బడ్జెట్ విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోస్టల్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలంటే అందరికీ సంబంధిత పోస్టాఫీసులో ఖాతాలు ఉండాలి. బయోమెట్రిక్ తీసుకోవాలి. పోస్టల్ ద్వారా పింఛన్ల పంపిణీకి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో నవంబరు నెలలో పంపిణీ సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకం అయింది. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే జరగలేదనే కారణంతో అక్టోబరు నెలలో ఒక్కరికి కూడా పింఛన్ పంపిణీ చేయలేదు. వీరికి నవంబరు నెలలో కూడా అందడం గగనమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో పింఛన్ల పంపిణీ ప్రతినెలా 5వ తేదీలోపే జరిగేది. వైఎస్ తర్వాత పంపిణీ గందరగోళంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని మరింత గందరగోళంగా మార్చింది. పింఛన్ల మొత్తాన్ని పెంచినా.. అడ్డుగోలుగా కోతలు పెడుతోంది. అర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. సెప్టెంబరు నెలలో 3.25 లక్షల పింఛన్లు ఉండగా అక్టోబరు నెలలో వాటిని 2.20 లక్షలకు తగ్గించారు. వీటిలో 18 వేలకు పైగా కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి రూ.22.94 కోట్లు విడుదలవగా.. 1,74,661 పింఛన్లు మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 30 వేల పింఛన్లకు ఫోటోలు, వేలిముద్రలు మ్యాచ్ కాలేదని పింఛన్లు నిలిపివేశారు. -
ప్రజా పక్షాన పోరాటం
వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్ బొబ్బిలి : ప్రజలను నమ్మించి, మాయ మాటలు చెప్పి అమలు చేయలేని వాగ్దానాలిచ్చి టీడీపీ అధికారంలోనికి వచ్చిందని, అవన్నీ ఇప్పుడు అబద్ధాలని తేలాయని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ హామీలు అమలు చేసే వరకూ ప్రజల తరఫునప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని చెప్పారు.ప్రభుత్వంపై వ్యతిరేకిత ఉన్నా బయటకు రానివ్వకుండా మీడియా సహకారాన్ని అందిస్తోందన్నారు. ప్రభుత్వం చేసిన ప్రతీ తప్పిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకొని ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు. వీటికి త్వరలో నియమించనున్న కమిటీలే ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు. నిస్వార్థంగా పనిచేసి కష్టపడేవారికి కమిటీల్లో స్థానం ఉంటుందన్నారు. జన్మభూమిలో పింఛన్ల పంపిణీలో అర్హులను తప్పించడం వంటి వాటిపై స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంపై పోరాటం చేస్తూనే, అధికార పార్టీని నమ్మి అధికారులు చేస్తున్న తప్పిదాలను కూడా ప్రజలు ముందుంచాల్సిన అవసరం ఉందన్నారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి కమిటీల పేరుతో ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసిందన్నారు. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు మినహా మిగిలిన మండలాల్లో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొమరాడ మండలంలో పింఛన్లు ఇవ్వడానికి ఏకంగా మంత్రి ఇచ్చిన లేఖలు పట్టుకొని వచ్చి కమిటీలు వేసుకున్నారన్నారు. పింఛన్లు తొలగించడంతో టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ సర్పంచ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీనిపై పోరాటం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జిల్లాలో పింఛన్ల సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఇచ్చిన వారిలో అనర్హులు, అర్హత ఉండే వారి జాబితాను పార్టీ కార్యకర్తలు, నాయకులు తయారు చేయాలన్నారు. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు తొలగిస్తే బాధితుల తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అందుకు పూర్తి వివరాలను అందించాలన్నారు. జిల్లాలో పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. నాలుగేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వస్తే ‘‘మిమ్మల్ని మోసం చేశాం.. మేం మోసపోయాం ’’ అంటూ అడుగడుగునా మహిళలు, పేదల రోదనలే వినిపించాయని, దాంతో షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగని పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది వేల మంది పింఛనుదారులను తొలగించారన్నారు . గ్రామస్థాయిలో కమిటీలు అవసరమని, వాటి ద్వారా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అవకాశం ఉందన్నారు. విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చెప్పినట్లు చేయడం లేదని, ఏ పథకాలకూ బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వారికి అండగా ఉండి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 5న మండల కార్యాలయాల వద్ద నిర్వహించిన ధర్నాల సందర్భంగా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టామన్నారు. జిల్లాలోపార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం నియోజకవర్గ నాయకుడు పరీక్షిత్‌రాజ్, సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావు, పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, గంట్యాడ మండల ఎంపీటీసీ సభ్యుడు జైహింద్‌కుమార్, బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడరు రౌతు రామ్మూర్తినాయుడు తదితరులు మాట్లాడారు. ఎస్‌కోట నియోజకవర్గ సమన్వయకర్త నెక్కలి నాయుడు బాబు, ప్రచార కమిటీ నాయకడు గొర్లె వెంకటరమణ, వ్యవసాయ విభాగం నాయకులు సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనుమల్ల వెంకటరమణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, విజయనగరం నాయకులు, కౌన్సిలర్లు ఎస్వీ రాజేష్, ఆశపు వేణు, అవనాపు విక్రమ్, సాలూరు నాయకలు జర్జాపు సూరిబాబు, బొబ్బిలి ఎంపీపీ గోర్జి వెంకటమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు మామిడి గౌరమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బేతనపల్లి శివున్నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ మడక తిరుపతిరావు, నర్సుపల్లి వెంకటేశ్వరరావు, గిరి రఘు తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్.. టెన్షన్!
జోగిపేట: జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఐదు వేల పింఛన్ల పంపిణీ జరిగినట్లు సమాచారం. అయితే పింఛన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. పింఛన్ల కోసం దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా రావడం, మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు పాటు వివిధ కేటగిరీల కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 6,7 తేదీల్లో అర్హుల జాబితాను ఎంపిక చేసి పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులు ప్రకటించారు. అయితే జాబితా సిద్ధం కాకపోవడంతో ఆ ఆదేశాలను చాలా వరకు సిబ్బంది పాటించలేదనే విమర్శలున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో పెన్షన్లు పొందిన వారు మాత్రం తమకు పెన్షన్ వస్తుందో..రాదోననే ఆందోళనతో ఉన్నారు. జిల్లాలో సుమారుగా 2.40 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ చే సేందుకు ఎంపిక చేశారని అధికార వర్గాలు తెలిపాయి. అందోలు మండలంలో నగర పంచాయతీ మినహా మిగతా గ్రామాల్లో 6,914 దరఖాస్తులు రాగా, 4374 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. జోగిపేట-అందోలు నగర పంచాయతీ పెన్షన్ల విషయంలో కొంత అయోమయం నెలకొంది. పట్టణంలో పెన్షన్ దారులు, దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1,500 ఇస్తుండడంతో లబ్ధిదారులు కొత్త పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ చేతుల మీదుగా సుమారు 600 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. అయితే చాలా మంది పేర్లు జాబితాలో కనిపించకపోవడం...వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాల్లో పంపిణీ చేస్తామని చెబుతున్నా, అది సాధ్యం కాదంటున్నారు. ప్రొసీడింగ్‌లను సిద్ధం చేసి కార్డులను సిద్ధం చేసి, జాబితాను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. -
మంత్రి సభలో వాగ్వాదం
కూసుమంచి : ఆసరా పథకం పింఛన్ల పంపిణీ కోసం కూసుమంచిలో శనివారం ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా రాగా పాల్గొన్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేం జిల్లాలో 2.45 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఈ ప్రభుత్వం తగ్గిస్తోందని, పింఛన్లు ఎందుకు తగ్గిస్తారని, ఏ ఒక్క పింఛన్ పోయినా తాను ఊరుకోనని, పోరాడుతానని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు కూడా బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇస్తే ఎందుకు సరిపోవడం లేదని, పెండిండ్ బిల్లులే రూ.1500 కోట్లు ఉన్నాయని, వీరు ఇచ్చింది ఏ ముందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమేనని ఎమ్మెల్యే అనడంతో టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మీ ప్రభుత్వం ఏమి చేసిందని ..? మీ ప్రభుత్వంలోనే ఇళ్ల బిల్లులు రాలేదని, మీరే తెలంగాణ ద్రోహి’ అంటూ ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు పలికి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో డీఎస్సీ బాలకిషన్, సీఐ రవీందర్‌రెడ్డి కలుగ జేసుకుని సోమయ్యను, కార్యకర్తలను శాంతింపజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీని వేదికపైకి విసిరేందుకు యత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పద్మారావు కల్పించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను వారించారు. సభా వేదికపై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా జడ్పీ చైర్మన్ కవిత అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు మంత్రి చురకలు... ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో చురకలు వేశారు. మంత్రి మాట్లాడుతూ రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నకు తనకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనున్న తాను రామన్న అంటూ పిలుస్తానని కవ్వింపుగా మాట్లాడారు. అన్నా అంటూ పిలిచిన తనను మంచిగా హైదరాబాద్‌కు పంపుతాడేమోనని అనుకుంటే పక్కనే ఉంటూ బొక్కేసిండూ అంటూ చురకలేశాడు. అన్నా మీరు మాట్లాడింది బాగానే ఉంది కానీ, మీ ప్రభుత్వంలోనే తెలంగాణకు ఒక్క పైసాగూడా ఇవ్వమని అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు మీరు మంత్రిగానే ఉన్నారు కదా..? అప్పుడు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నివ్వెర పోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అవుతోందని, అప్పుడే విమర్శిస్తే ఎలా..? అభివృద్ధికి సహకరించాలంటూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. -
అర్హులందరికీ ‘ఆసరా’
ఖమ్మం సిటీ: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అండగా ఉండడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టిం దని, ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బం గా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలో నిరుపేదలు, నిర్భాగ్యులకు కనీసం ఒక్క పూట భోజనం ఖర్చు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రూ.200 కనీసం వారికి మందుల ఖర్చుకు కూడా సరిపోవడం లేదని, అందుకే పింఛన్‌ను రూ.1000కి పెంచామని చెప్పారు. దీంతో ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానాపై సుమారు రూ.4 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ నెల పింఛన్‌ను నగదు రూపంలో చెల్లిస్తామని, వచ్చేనెల నుంచి లబ్ధిదారుల ఖాతా ల్లో జమ చేస్తామని చెప్పారు. పింఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు చేసుకోవాలని సూచిం చారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. ఇంత పెద్ద కార్యక్రమా న్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం గర్వం గా ఉందన్నారు. అనంతరం వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు అందించా రు. జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడు తూ పింఛన్ల పంపిణీ ఒక బృహత్తర కార్యక్రమమన్నారు. వృద్దులు, వికలాంగుల పరిస్థితి దయనీయంగా మారకుండా ఉండేం దుకే ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, దీన్ని అరికట్టాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ జిల్లాలో 3,14,214 దరఖాస్తులు వచ్చాయని, అందులో 2.20లక్షల మందికి పింఛన్లు మంజూ రు చేసినట్లు తెలిపారు. రేషన్ సరుకుల కోసమే ఆహార భద్రత కార్డులు ఇస్తున్నామన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ పింఛన్ల పెంపు నిర్ణయం హర్షణీయమన్నారు. గతంలో ఖమ్మం నగరంలో14 వేల పింఛన్లు ఉండగా, ఈసారి 27వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 8వేల మంది నే సర్వే చేశారని, అందులో నాలుగు వేలమందిని మాత్రమే పింఛన్లకు అర్హులుగా గుర్తించారని వివరించారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ వేణుమనోహర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్, రఘునాధపాలెం ఎంపీపీ మాలోతు శాంత, తహశీల్దార్ వెంకారెడ్డి, కార్పొరేషన్ మేనేజర్ రాజారావు, డీఈలు రామన్, వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
అట్టహాసంగా...
జంట జిల్లాల్లో 5,500 మందికి పింఛన్ల పంపిణీ హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. పూర్తిగాని లబ్ధిదారుల ఎంపిక, కొనసాగుతున్న పరిశీలన నిలదీత, విజ్ఞప్తులతో గందరగోళం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ‘ఆసరా’ పథకం కింద శనివారం 5,500 మంది వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆసరా పథకం కింద నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడంతో కార్యక్రమం ఆర్భాటంగా సాగింది. గతంలో పింఛన్లు పొందిన వారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారంతా రావడంతో సందడి నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడా పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని సంతృప్తి పరచడానికి అధికారులు నానా హైరానా పడాల్సి వచ్చింది. పింఛన్లు మంజూరు గాని వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని... గతంలో మాదిరిగా పింఛన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. తొలి దశలో భాగంగా నగరంలో 12 వేల పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో శనివారం 3,500 సామాజిక పింఛన్లు పంపిణీ చేసినట్టు కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఆదివారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా పింఛన్లు పంపిణీ చేసినట్టు అధికారుల పేర్కొంటున్నారు. పథకాన్ని ప్రారంభించిన నేతలు... సైదాబాద్ మండలం బాల రావమ్మ బస్తీలో, చార్మినార్ మండలం బండ్లగూడలోని బహదూర్‌పురా ప్రాంతాల్లో ఆసరా పథకాన్ని డిప్యూటీ సీఎం మహముద్ అలీ లాంఛనంగా ప్రాభించారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబర్పేట్, ముషీరాబాద్, నాంపల్లి మండలాల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. గోల్కొండలో ఎమ్మెల్యే కౌసర్ మోయినొద్దీన్, అమీర్‌పేట్‌లో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, హిమాయత్‌నగర్‌లో ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆఫిస్నగర్లో ఎమ్మెల్యే జాఫర్ హూస్సేన్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. -
నేడు ఆసరా పథకం ప్రారంభం
ఖమ్మం జెడ్పీసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆసరా పథకం శనివారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి టి.పద్మారావు చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు స్థానిక పెవిలియన్ గ్రౌండ్లో ఖమ్మం నియోజకవర్గ లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. అనంతరం కూసుమంచి మండలం కేంద్రంలో ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. మొదటిగా నియోజకవర్గానికి వెయ్యిమందికి పింఛన్లు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆయా ప్రజాప్రతినిధులు పింఛన్లను అందజేయనున్నారు. 9న మండల కేంద్రాల్లో సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. 10న గ్రామస్థాయిలో ప్రారంభించి దశల వారీగా 30 వరకు పూర్తి చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు, కల్లుగీత, చేనేత పింఛన్లకు 3.13 లక్షల దరఖాస్తులు రాగా అధికారులు 3 లక్షల దరఖాస్తులను పరిశీలించి 2.40 లక్షల మందిని అర్హులుగా నిర్ధారించారు. వీటిలో 1.12 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లకు 51 వేలు, వితంతు 46 వేలు, వికలాంగులు 12వేలు, చేనేత కార్మికులకు 553, గీత కార్మికులవి 850 దరఖాస్తులను పూర్తి చేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 2,44,730 మందికి పింఛన్లు అందేవి. అయితే ప్రభుత్వం అనర్హులను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించి, వాటిని ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించి అనర్హులను తొలగించనుంది. -
పింఛను పాట్లు
కొవ్వూరు/పెరవలి/నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం వృద్ధులతోపాటు వికలాంగులు, వితంతువుల పాలిట శాపంగా మారింది. వృద్ధుల్లో కొందరి వేళ్లపై ముద్రలు అరిగిపోవడంతో రెండు నెలలుగా వారికి పింఛన్లు అందటం లేదు. బయోమెట్రిక్ మెషిన్‌పై వేలిముద్ర వేస్తే తప్ప పింఛను ఇచ్చే అవకాశం లేదని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ కారణంగా జిల్లాలో సుమారు 15వేల మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రతి గ్రామంలోను కనీసం 10 మంది వృద్ధులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే 830 మంది వేలిముద్రలు బయోమెట్రిక్ మెషిన్‌పై పడకపోవడం వల్ల పింఛన్లు అందుకోలేకపోతున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను తీసుకోకపోతే రద్దు చేసే పరిస్థితి ఉండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వికలాంగుల్లోనూ కొందరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. నేటికీ పూర్తికాని వేలిముద్రల సేకరణ పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చి మూడు నెలలు కావస్తోంది. నేటికీ లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ పూర్తికాలేదు. దీనివల్ల ఈ నెలలో కొవ్వూరు మండలంలో 322 మందికి, చాగల్లు మండలంలో 205 మందికి, తాళ్లపూడి మండలంలో 203 మందికి, కొవ్వూరు మునిసిపాలిటీలో సుమారు 100 మందికి పింఛన్లు అందలేదు. గత నెలలో నియోజకవర్గంలో సుమారు 3,700 మందికి పింఛన్లు అందలేదు. బయోమెట్రిక్ మెషిన్లో వేలిముద్రలు సక్రమంగా నమోదు కాలేదని కొందరికి.. సొమ్ములు విడుదల కాకపోవడంతో మరికొందరికి పింఛను సొమ్ము ఇవ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేది. అనంతరం ఫినో సంస్థ ద్వారా పింఛన్లు బట్వాడా చేసేవారు. అనంతరం ఆరునెలలపాటు పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇచ్చారు. రెండు నెలల క్రితం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇక్కడ నుంచే ఫించను లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియను ముగించనున్నారు. ఈ ఏడాది వరుసగా రెండుసార్లు పంపిణీ విధానాలు మార్చడంతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు మొదలయ్యూరుు. నాలుగు నెలలుగా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛను నాకెంతో ఆసరాగా ఉండేది. నాలుగు నెలలుగా పింఛను డబ్బు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. వేలిముద్రలు పడకపోవడంతో రోజూ మునిసిపల్ కార్యాలయూనికి వెళ్లి గంటల తరబడి వేచివుంటున్నాను. అరుునా ప్రయోజనం లేదు. ఈ విధానాన్ని మార్చి పాత పద్ధతిలోనే పింఛను ఇప్పించాలి.- బందెల పవన్శేఖర్, కొవ్వూరు ఇంకు ముద్ర తీసుకోవాలి బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా పింఛను ఇవ్వటం లేదయ్యా. గతంలో ఇంకు ముద్ర నొక్కించుకుని పింఛను ఇచ్చేవారు. ఈమధ్య కాలంలోనే ఫించన్ కోసం తిప్పలు పెడుతున్నారు. డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. వచ్చే రెండొందలు మందు బిళ్లల ఖర్చుకు ఉపయోగపడేది. - మజ్జి అన్నపూర్ణ, నరసాపురం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బయోమెట్రిక్ విధానం వల్ల 3 నెలలుగా పింఛను రావడం లేదు. వేలిముద్రలు పడలేదని పింఛను సొమ్ము ఇవ్వడం లేదు. నలుగురు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్న నాకు వితంతు పింఛను ఎంతో ఆసరాగా ఉండేది. చిన్న పిల్లలు కావడంతో కార్యాలయాల చుట్టూ తిరగడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాను. అధికారులు పాత పద్ధతిలోనే పింఛను ఇచ్చే ఏర్పాటు చేయాలి. - కవల భారతి, కొవ్వూరు