'ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ కార్డు తప్పని సరి'
హైదరాబాద్: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలనుకునే వారికి అధార్ కార్డు తప్పనిసరి అని మీ సేవ డైరెక్టర్ అన్నారు. పెన్షన్, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం విధిగా ఆధార్ కార్టు పొందాలని ఆయన సూచించారు.
ఆధార్ కార్డుల జారీ కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎల్లుండి నుంచి కొత్తగా 15 ఆధార్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు మీ సేవ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఆధార్ పొందని వారు కొత్త కేంద్రాల వద్ద నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.