ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్ | alladurgam people demands water for MP BB patil | Sakshi
Sakshi News home page

ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్

Published Sun, Jul 12 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్

ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్

అల్లాదుర్గం రూరల్ (మెదక్): నీటి సమస్యపై అల్లాదుర్గం గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వస్తున్నారని రోడ్డుపై బిందెలు పెట్టుకుని వాహనాన్ని అడ్డిగించి ఘెరావ్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆదివారం మధ్యాహ్నం అల్లాదుర్గం చేరుకున్నారు. నీటి కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్న స్థానికులు ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్ చేశారు.

గ్రామంలో రెండు రోజుల కోసారి నీరు సరఫరా అవుతుందని, నాలుగు రోజులకోసారి స్నానాలు చేస్తున్నామని ఆయనకు తెలిపారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ పాటిల్ నీటి ఎద్దడి నివారణకు మూడు రోజుల్లో కొత్త బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement