
కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్!
బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడు కిషన్‌రెడ్డికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
నల్లగొండ: బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నాయకుడు జి. కిషన్‌రెడ్డికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. కిషన్‌రెడ్డిని తన గెస్ట్‌హౌస్‌కు పిలుపించుకుని ఆయనను మందలించినట్టు సమాచారం. పిలుస్తున్నా వేదికపైకి ఎందుకు రాలేదని, అలగాల్సిన అవసరం ఏముందని కిషన్‌రెడ్డిని అమిత్ షా అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎవరికి వారు కాదు, పార్టీ కోసం పనిచేయాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం.
నల్లగొండ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న అమిత్ షా మంగళవారం ఉదయం వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దళితవాడకు దీన్‌దయాళ్ పేరు పెట్టారు. తర్వాత చిన్న మాదారంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడారు.