ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ శాసనసభ్యులకు మంగళవారం అసెంబ్లీ ఘనంగా నివాళులర్పిం చింది.
హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ శాసనసభ్యులకు మంగళవారం అసెంబ్లీ ఘనంగా నివాళులర్పిం చింది. మహరాజ్‌గంజ్ మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ, శివప్రసాద్, కార్వాన్ మాజీ ఎమ్మెల్యే ముక్తదాఖాన్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి వారి నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని స్పీకర్ కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు.