
కేసీఆర్ కుటుంబం ఖజానాను దోచుకుంటోంది :భట్టి
కాజీపేట రూరల్: తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియూగాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ ఉపనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట వెంకటరమణ గౌడ్ అధ్యక్షతన జరిగిన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్, ప్రైవేట్ పైపుల కంపెనీలు, కాంట్రాక్టర్లు లాభం పొందేందుకు మాత్రమే వాటర్ గ్రిడ్ చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ ఆటలు ఇకా సాగవని వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కాబోయే సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయూలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కోరారు.